Thursday, April 25, 2024

అష్ట ఐశ్వర్యాల వైచిత్రి

ధనము, విద్య, కులము, రూపము, బలము, అధికారము, అనుకూ లవతి అయిన భార్య, సత్సంతానము, అనే ఎనిమిదింటినీ అ్టష శ్వర్యాలు అంటారు. ఇవన్నీ కలిగిఉన్న వ్యక్తి జీవితం స్వర్గతుల్య మే. అందుకే పెద్దలు ”అ్టషశ్వర్య ప్రాప్తిరస్తు” అని పిల్లలను దీవిస్తూ ఉం టారు. ఇవి నిజంగా సంతోషదాయకాలేనా అని విచారణ చేసే కొద్దీ పరస్పర విరుద్ధమైన సమాధానాలే లభిస్తాయి. ఈ అ్టషశ్వర్యాలను ఒక్కొక్క దాని గురించి పెద్దలేమన్నారో చూద్దాం. మొదటి ఐశ్వర్యం ‘ధనం’. ‘ధనం’ అ్టషశ్వర్యాలలో ప్రధానమైనది. ధనసంపాదన మానవుల సహజ లక్షణం.
ఎందుకంటే ”ఏ నరునకు విత్తము కల
దానరుడు కులీనుడధికుడా ద్యుండతడే
ధీనిధి ధన్యుడు నేర్పరి
నానా గుణ గణము కాంచనంబున నిలుచున్‌” అని భర్తృహరి చెప్పినట్లుగా, ‘ధనమూలం ఇదం జగత్‌’ ఎవరి వద్ద ధనముందో వాడే లోకం లో ప్రస్తుతింపబడతాడు. సుఖజీవనం గడుపగలుగుతాడు. అయితే ఎప్పు డు ధనం ఎక్కువగా ప్రోగు పడుతుందో అప్పుడు అతను అహంకార పూరితు డవుతాడు. ధనమదాంధత అతడిని కప్పివేస్తుంది. వేమన చెప్పినట్లు
”ధనమెచ్చిన మద మెచ్చును
మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చున్‌
ధనముడిగిన మద ముడుగును
మదముడిగిన దుర్గుణం బు మానును వేమా”.
ధనం పెరిగే కొద్దీ గర్వము, దానితోబాటు దుర్గుణాలు పెరుగుతాయట. ధనం కరిగే కొద్దీ గర్వం దుర్గుణాలు కూడా కరుగుతాయట. అంతేకాదు. ధన ముంటే సుఖపడతామన్నది భ్రమ. ఎందుకంటే ”అర్థానా మార్జనం దు:ఖం, ఆర్జితానాంచరక్షణే/ నాశే దు:ఖం వ్యయే దు:ఖం ధిగర్థం దు:ఖభాజనం”. డబ్బు సంపాదించడంలో ఎంతో కష్టము, దు:ఖము ఉన్నాయి. సంపాదించి న తర్వాత దానిని కాపాడడంలోనూ కష్టము, దు:ఖమే ఉన్నాయి. ధనంపో యినా, ఖర్చైపోయినా కష్టమే. అన్నివిధాలా దు:ఖభాజనమైన సొమ్మెందుకు?
పైగా ధనవంతులను పైకి పొగడే జనమే అతని వెనుక, తమ లోలోన, వా నికి ‘నడమంత్రపు సిరి మిడిసిపాటు ఉందనీ’, ‘పొగరుబోతు’ అని తిట్టుకో వడమూ ఉంటుంది. అంతేనా! ధనమున్నందుకు దానిని సక్రమంగా దానధ ర్మాలతో సద్వినియోగం చేస్తూ పుణ్యం సంపాదించుకొందాం అనే వాళ్ళు తక్కువ. అక్రమ మార్గాలలో దాన్ని పెంచుకోడానికి పాపకృత్యాలు చేసి పతన మయ్యేవాళ్ళే ఎక్కువ. ”యోర్థేశుచి: సహ శుచి:”. ఎవడైతే ధనంపట్ల పరిశు ద్ధుడై ఉంటాడో అతడే పరిశుద్ధుడంటాయి శాస్త్రాలు. ఈ ‘ధనము’ ధనంకాదు. ‘మనోహ మహతాం ధనం’. మర్యాదగా ప్రవర్తంచే శీలమే నిజమైన ధనమ న్నారు పెద్దలు.
రెండవ ఐశ్వర్యం ‘విద్య’. ”విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే”. విద్యావంతులు అన్ని ప్రదేశాలలో గౌరవించబడతారు. చదువు వలన మేధాశక్తి పెరిగి ఎటు వంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలిగే ప్రజ్ఞ అబ్బుతుంది. ”ఆపదలకెల్ల కుదురు చదువులేమి” అన్నారు. కనుక భర్తృహరి చెప్పినట్లు ఐహకాముష్మిక ఫలములిచ్చేది విద్యయే. అయితే విద్యతోబాటు అణకువ, వినయం పెరగాలి తప్ప గర్వం పెరుగరాదు. పాండిత్య గర్వం ప్రమాద హితువు. ఎంతటి మేధా వి అయినా తనకు తెలిసింది సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే అని తెలు సుకొని మరింత విద్యనార్జించడానికి ప్రయత్నించాలే తప్ప విద్యా గర్వంతో ఇతరులలోని తప్పులనెంచడానికి ప్రయత్నించరాదు.
”తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై కరిభం గి సర్వమున్‌
తెలిసితినంచు గర్విత మతిన్‌ విహరించితి తొల్లి యిప్పుడు
జ్వలమతులైన పండితుల సన్నిధినించుక బోధశాలినై
తెలియని వాడనై మెలిగితిన్‌ గతమయ్యె నితాంత గర్వమున్‌”.
స్వల్ప జ్ఞానము కలవానిగా ఉన్నప్పుడు కన్నుమిన్ను కానక సర్వజ్ఞుడను అనుకొని మదించిన ఏనుగులాగా గర్వంతో మెలిగాను కానీ పండితుల సన్నిధిలో వారిని గమని స్తూ వారి వద్ద నేర్చుకొంటూ, కొంత తెలివిని పొందిన తర్వాత నాకిదివరకు ఏమీ తెలియదని తెలుసుకొని గర్వం విడచి వివేకినైనాను అని భర్తృహరి చెప్పినట్లుగా చదువుతో సౌశీల్యాన్ని, వినయాన్ని పెంచుకోవాలే కానీ అహంకారాన్ని, వాదవివాదాలను పెంచుకోరాదని తెలుసుకోవాలి. ”శుభములనివ్వని చదువు చప్పన” అన్నాడు సుమతీ శతకకారుడు.
మూడవ ఐశ్వర్యం ‘కులీనత’. గొప్ప వంశంలో జన్మించడం అదృష్టం కావచ్చు. అది దేవుడిచ్చిన వరం కావచ్చు. కానీ అందులో మన ఘనత ఏమీ లేదు. ”మా తాతలు నేతులు త్రాగారు. కావాలంటే మా మూతులు వాసన చూ డండి” అన్నట్లు కులం పేరుతో, వంశంపేరుతో, జాతి పేరుతో ఘనులుగా పరి గణింపబడాలనుకోవడం అవివేకం. ”శీలం విశాలం కుల మామనంతి”. మని షి సత్ప్రవృత్తిని కులమనాలి తప్ప వారి పుట్టుకను కాదన్నాడు క్షేమేంద్రుడు. తన ప్రవర్తన వలన తన వంశానికి పేరు తేవడం గొప్పదనం. అంతేకానీ ఆ వంశం వలన తనకు కీర్తి రావాలను కోవడం మూర్ఖత్వం. బురదలో పుట్డినా కమలం విలువ తగ్గదు. పామునోటిలో ఉన్నా రత్నానికి విలువ తగ్గదు. చెర కు చివర పుట్టినా వెన్నుకు మాధుర్యం లేనట్లే ఉత్తమ కులంలో పుట్టినా దుర్మా ర్గులకు కీర్తి కలుగదు.. అని గుర్తెరగాలి.
నాలుగవ ఐశ్వర్యం ‘రూపము’. అంటే దేహ సౌష్టవము, సౌందర్యము. పుట్టుకతో లభించే దేహాన్ని వస్త్ర, భూషణ, లేపనాది అలంకారాలతో, అందా న్ని పెంచి, అందరూ తన రూపాన్ని ప్రశంసిస్తూ ఉంటే మురిసిపోవడం మాన వుల సహజ నైజం. అయితే పైపై మెరుగులద్దితే వచ్చే బాహ్య సౌందర్యం కంటే పరిశుద్ధమైన అంత:సౌందర్యం, సుగుణాల వలన, మరింత శోభించి లోకం లో పదిమందిచేత పొగడబడుతుంది. అదే అసలైన అందం. దేహ సౌందర్యం అశాశ్వతం. జరామరణ భయాలు నిరంతరం మనిషిని వెన్నా డుతూనే ఉం టాయి. ముసలితనంలో తమ రూపం ఎక్కడ వడలిపోతుందో అనే బాధ కలచివేస్తూ ఉంటుంది. మరి సౌందర్యం ఐశ్వర్యమెలా అవుతుంది?
ఐదవ ఐశ్వర్యం ‘బలము’. లోకంలో ఎప్పుడూ బలవంతులదే రాజ్యం కదా అని తమ దేహ బలాన్ని చూచుకొని పొంగిపోవడం అవివేకం. సుమతీ శతకం చెప్పినట్లు ”బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ!”
బలమున్నవానిదే గెలుపు అనేది ఎల్ల కాలమూ చెల్లదు. చలి చీమలు పామును చంపడమే దీనికి ఉదాహరణ. అంతేకాదు, దేహ బలంకన్నా బుద్ధిబలం గొప్పది.”
”లావుగల వానికన్నను భావింపగ నీతిపరుడె బలవంతుండౌ
గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహలో సుమతీ!”
కొండంత మదపుటేనుగైనా బుద్ధిశాలి అయిన మావటివానికి లొం గినట్లు, దేహబలం కలవానికన్నా ధీశాలియే బలవంతుడని తెలుసు కోవాలి. బలగర్వం తగదు.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి,
    944078123

Advertisement

తాజా వార్తలు

Advertisement