Thursday, April 25, 2024

ఆశ్రిత కల్పవృక్షం సాయిబాబా

శ్రీసాయినాథులు కిందటి జన్మలలో తమ భక్తులైన వారిని మరు జన్మలో కూ డా వేటగాడు పిచుక కాలికి దారం కట్టి లాగుకొని తీసుకువచ్చిన రీతిలో శిరి డీకి రప్పించుకొనేవారు. వారికి తగినరీతిలో బోధలను చేసి ఆధ్యాత్మిక జాగృతిని కథ-
బాబా కూర్మి భక్తులైన నానాసాహబ్‌ చందోర్కర్‌, దాసగణుల వలన బాబా ఖ్యా తి యావత్‌ భారత దేశమంతటికీ పాకింది. అందునా దాసగణు తన హరికథల ద్వారా బాబా వారి లీలలను వినే వారి హృదయాలలో శాశ్వతంగా నిలుచునట్లు చేసేవాడు. ఒకసారి ఠాణ పట్టణంలోని కౌపీనేశ్వరాలయంలో దాసగణు మహరాజ్‌ సాయి మహ మపై హరికథను పాడుతున్నాడు. అక్కడి శ్రోతలలో చోల్కర్‌ అనే ఒక పేదవాడు వు న్నాడు. ఆతను ఠాణ సివిల్‌ కోర్టులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. దాసగణు యొక్క కీర్తనను విని సాయిపై ఎనలేని విశ్వాసం పెంచుకొన్నాడు. అక్కడికక్కడే బాబాను ధ్యా నించి ”ఓ సాయి. నేను చాలా పేదవాడిని. నా కుటుంబమంతటినీ గౌరవమైన రీతిలో పోషించడం బహు కష్టముగా వుంది. నీ అనుగ్రహం వలన నేను గవర్నమెంట్‌ వారి పరీక్షలో పాసు అయ్యి పర్మినెంటు ఉద్యోగం దొరికితే శిరిడీకి వచ్చి దర్శనం చేసుకుం టాను. కలకండ పంచి పెడతాను.దయ చేసి అనుగ్రహంచు” అని మొక్కుకున్నాడు.
భక్తుల పాలిట ఆశ్రిత కల్పవృక్షం, ఆర్తత్రాణ పరాయణుడు అయిన సాయి చోల్క ర్‌ను తగు రీతిన ఆశీర్వదించారు. ఆ తర్వాత జరిగిన పరిక్ష లో చోల్కర్‌ మంచి మార్కు లతో పాసయి చక్కని గవర్నమెంట్‌ ఉద్యోగం సంపాదిం చాడు. ఇక శ్రీఘ్రమే మొక్కు తీర్చవలసిన బాధ్యత చోల్కర్‌ పై పడింది. చోల్కర్‌ కడు బీదవాడు. వాని కుటుంబం కూడా చాలా పెద్దది. వచ్చే అరకొర జీతం కుటుంబం పోషించడానికే సరిపోవడం లేదు. అందుచేత చోల్కర్‌ అప్పటికప్పుడు తాను త్రాగే టీ లో పంచదారను మానివే యాలని నిర్ణయించుకున్నాడు. దాని ద్వారా కూడబెట్టిన పైకంతో శిరిడీకి వచ్చి బాబా పాదాలపై పడి నమస్కారం చేసాడు. అంతేకాక తన మొ క్కు ప్రకారం శిరిడీలో అంద రికీ బాబా పేరున కలకండ పంచిపెట్టాడు. బాబా వద్దకు వచ్చి ఒక కొబ్బరికాయ సమ ర్పించి ”బాబా! ఈనాటికి నీ దయ వలన నా మొక్కు తీరింది. నా మనస్సులోని కోరిక లన్నీ తీరినవి. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా వుంది, దయచేసి నన్ను ఆశీర్వదించు” అని ప్రార్ధించాడు. శిరిడీలో చోల్కర్‌ బాపూ సాహబ్‌ జోగ్‌ ఇంటిలో వు న్నాడు. బాబాకు నమస్కరించిన తర్వాత ఇద్దరూ తమ ఇంటికి పోవడానికి బయలుదేరారు. అప్పుడు బాబా జోగ్‌తో ”బావూ! నీ అతిథికి టీ కప్పులో ఎక్కువ చక్కెర వేసి ఇవ్వు” అని చిరు నవ్వుతో అన్నారు. ఆ మాటలు బాపూ సాహబ్‌ జోగ్‌కు అ ర్ధంకాలేదు, కాని అందులోని మర్మం గ్రహంచిన చోల్కర్‌ కళ్ళు ఆనందబాష్పములతో నిండాయి. బాబా తన మనస్సునందు నమ్మకం, భక్తి స్థిరము చేయడానికి ఈవిధముగా అన్నారని గ్ర#హం చాడు. తన మొక్కు ప్రకారం రావ లసిన కలకండ ముట్టినదని, టీలో చక్కెర ఉపయో గించక, తద్వారా మిగిల్చిన పైకంతో తాను శిరిడీకి వచ్చిన సంగతి బాబా గ్ర #హంచి తనను ఆశీర్వదించారని చోల్కర్‌ గ్రహంచి ఆనందంతో మైమరిచిపోయాడు.
అప్పుడు వారిద్దరికీ బాబా ఒక అపూర్వమైన బోధనను చేసారు ”నా ముందు భక్తి తో మీరు చేతులు చాపినచో రాత్రింబవళ్ళు మీ చెంతనే వుంటాను. నా దే#హము ఇక్కడ శిరిడీలో వున్నప్పటికీ ఏడు సముద్రాల అవతల మీరు చేయు పనులు కూడా నాకు తెలుస్తాయి. నా నివాస స్థలము మీ హృదయంనందే వున్నది. సర్వజీవుల హృదయ ములలో కొలువైవున్న ఆత్మగా, సర్వాంతర్యామిగా నన్నెవరు గుర్తించి పూజించెదరో వారు ధన్యులు, పావనులు, మోక్షార్హులు, వారికి మరి పునర్జన్మ లేదు” అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement