Saturday, November 27, 2021

మాలధారణం నియమాల తోరణం..

అకుంఠిత దీక్ష, అంతులేని ఆత్మ విశ్వాసం, అంతకుమించి సన్నిధానానికి చేరు కొని అయ్యప్పను దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యం. ఈ దీక్ష అద్వి తీయమైన నియమాలతో రూపొందించింది. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారై నా ఈ దీక్షను చేపట్టాలని, దీక్ష వహించిన గురుస్వాములు చెబుతుంటారు. ఎందుకం టే ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దీక్షవల్ల వచ్చే మానసిక ఆనందం, ఆత్మ పరిశీలనశక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం దీక్షాపరులకు అనుభవంలోకి వస్తాయి. ఏటా కోట్లాదిమంది భక్తులు ఈ దీక్ష తీసుకుంటారు. దీక్ష 41రోజుల పాటు ఉంటుంది. దీనినే మండల దీక్ష అని పిలుస్తారు. ఇలా దీక్ష వహించిన భక్తులు ఇరుము డి కట్టుకోవడం ఓ ఆచారంగా వస్తుంది.
ఇరుముడి అంటే రెండు అరలున్న చిన్న మూట అని అర్థం. దీనిని నెత్తి మీద పెట్టు కుని, సన్నిధానానికి చేరుకోవడం ఓ సంప్రదాయం. ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ, రెండు కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణాలు, పసు పు, గంధంపొడి, విభూతి, బియ్యం, పన్నీరు, అటుకులు, మరమరాలు, బెల్లం/అరటి పండ్లు, కలకండ, అగర వత్తులు, కర్పూరం, మిరియాలు, తేనె, ఎండు ద్రాక్ష, తువ్వాలు పెట్టుకుంటారు. ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకుం టారు. ఈ ఉత్సవాన్ని ”కెట్టు నిర ”లేదా ”పల్లెకట్టు ”ఉత్సవం అంటారు.
బాల్యంలోనే మహా జ్ఞాన సంపన్నుడై సకల దేవతల అంశలను తనలో ఇముడ్చు కున్నాడు అయ్యప్ప. తన భక్తులకు శని ప్రభావం కలిగించనని శనిదేవుడు అయ్యప్పకు వాగ్దానం చేసాడు. అయ్యప్ప, శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను మానవులు తన దీక్షాకాలంలో ధరించాలని, దీక్షా సమయంలో నల్లని దుస్తులు ధరించిన వారికి జీవి తాంతం శని ప్రభావం ఉండదని అయ్యప్ప తన భక్తులకు చెప్పాడు.
అయ్యప్ప సన్నిధానానికి చేరుకోవడానికి 41రోజుల ముందు ఈ దీక్ష చేపట్టాలి. దీనిలో భాగంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తల స్నానం చేయాలి. అలాగే సాయంత్రం పూజకు ముందు కూడా స్నానంచేయాలి. ఉదయం, సాయంత్రం స్వామి కి దీపారాధన చేసి స్తోత్ర పఠనం చేయాలి. దేవతార్చన విధిగా నిర్వహించాలి. మధ్యా హ్నం భిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. దీక్షాసమయంలో నల్లని దుస్తులు ధరించాలి. రోజూ దేవాలయాన్ని దర్శించాలి. పాదరక్షలను పూర్తిగా త్యజించాలి. క్షవరం చేయించుకోవడం, గోళ్లు తీసుకోవడం కూడదు. మెడలో ధరించిన ముద్రమా లను ఎట్టి పరిస్థితిలో తీయకూడదు. దీక్షాసమయంలో బ్రహ్మ చర్యం పాటించాలి. మంచం మీద నిద్ర పోకూడదు. పరుపులు, దిండ్లు విడిచి పెట్టి, చాప మీద నేల మీద నిద్ర పోవాలి. శవం, బహష్టు అయిన స్త్రీలను చూడకూడదు. ఒకవేళ ఏదయినా సంద ర్భంలో చూస్తే పంచగవ్య శిర స్నానం చేసి, శరణు ఘోష చేయాలి. శరణు ఘోష చేసేం త వరకు మంచినీళ్లు సైతం ముట్టుకోకూడదు. ఎప్పుడూ స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని జపించాలి. దీక్షలో ఉన్నప్పుడు భార్యను సైతం దేవతగా చూడాలి. ఎవరినైనా పిలిచినప్పుడు స్వామి లేదా అయ్యప్ప అని పిలవాలి. పరస్త్రీలను తల్లిగా భావించి మాత అని సంబోధించాలి. ఎవరైనా భిక్షకు పిలిస్తే కులమతాలు విడిచి పెట్టి భిక్షకు వెళ్ళాలి. ఎల్లప్పుడూ నుదిటిపై కుంకుమ, విభూతి, గంధం ధరించాలి. మద్య, మాంసాలకు దూరంగా ఉండాలి. పూర్తిగా శాఖాహారాన్ని స్వీకరించాలి. హింసకు దూరంగా ఉండాలి. దీక్షాసమయంలో సాటి అయ్యప్పలకు ఒకసారైనా బిక్ష పెట్టాలి. సాటి స్వాములకు, గురు స్వాములకు పాదాభివందనం చేయాలి.
కార్తీక మాసం అయ్యప్ప మాల ధరించడానికి అనువైన కాలం. దీనికి తిథి, వార, నక్షత్ర, యోగాది కరణాలతో పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో పూజ ఆపకూడదు. అయ్యప్ప నామమే పరమావధిగా భావించాలి. భక్తి విశ్వాసాలతో స్వామి సేవలో తరించాలి.

  • దాసరి దుర్గాప్రసాద్‌
    77940 96169
Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News