Friday, April 19, 2024

అన్నమయ్య కీర్తనలు : రారా చిన్నన్న

రాగం : ఘంఘనావి

రారా చిన్నన్న రారోరి చిన్నవాడ
రారా ముద్దులాడ రారోరి బాలకృష్ణ || ||రారా చిన్నన్న||

కింది చూపుల గిలిగించి ఆలమంద గొల్లెతల మరిగించి
సందడి వలపించి జవరాండ్ల వూర వింద వైనట్టి వేడుకకాడ

కొదలు మాటలనె గొణగుచు భూమి సుదతుల శిగ్గులు చూరాడి
చిదుగుచేతలనె చెనకుచు ముద్దు పెదవి చవులు చూపిన జాణకాడ

కలికి తనముననె కరిగించికాచె చెలుల కాకిటనె చెలగి
లలనామణియైన లకిమమ్మ కలసుక శ్రీ వేంకటనాధుడైవాడ

Advertisement

తాజా వార్తలు

Advertisement