Saturday, April 20, 2024

అన్నమయ్య కీర్తనలు

రాగం : రేవతి

ప|| ఏడ సుజ్ఞానము యేడ తెలివి నాకు
బూడిదలో హోమమై పోయ కాలము || ఏడ సుజ్ఞానము ||

చ|| ఇదె మేలయ్యెడినాకదె మేలయ్యెది నని
కదిసిన యాసచే గడవలేక
యెదుర చూచి యెలయించి మెలయించి
పొదచాటు మృగమై పోయ కాలము || ఏడ సుజ్ఞానము ||

చ|| ఇంతట దీరెడి దు:ఖ మంతట దీరెడినని
వింత వింత వగలచే వేగి వేగి
చింతయు వేదనల చిక్కువడుచు నగ్ని
పొతనున్న వెన్నయై పోయకాలము || ఏడ సుజ్ఞానము ||

చ|| యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని
యెక్కడికైనా నూరకైగి యేగి
గక్కన, శ్రీ తిరువేంకటపతి గానక
పుక్కి పురాణమై పోయకాలము || ఏడ సుజ్ఞానము ||

Advertisement

తాజా వార్తలు

Advertisement