Saturday, April 20, 2024

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

రాగం : హంసానంది

అన్నమయ్య కీర్తనలు : ఇతర మెరుగగతి

ప|| ఇతర మెరుగగతి ఇదియె శరణ్యము
సతత పూర్ణునికి శరణ్యము || ఇతర ||

చ|| సర్వలోకముల సాక్షైగాచిన
సర్వేశ్వరునకు శరణ్యము
ఉర్వికి మింటికి వొక్కటి చెలగిన
సార్వభౌమునకు శరణ్యము || ఇతర ||

చ|| శ్రీకాంతనురము చెంగట నిలిపిన
సాకారునకు శరణ్యము
పైకొని వెలిగేటి పరంజ్యోతియై
సౌకుమారునకు శరణ్యము || ఇతర ||

- Advertisement -

చ|| తగనిహ పరములు దాసులకొసగెటి
జగదీశ్వరునకు శరణ్యము
నగశ్రీ వేంకట నాధుడనీకు
సుగుణ మూర్తికిదె శరణ్యము || ఇతర ||

Advertisement

తాజా వార్తలు

Advertisement