Thursday, April 25, 2024

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

రాగం : యమన్‌

ప|| ఎటువంటి యాగ డీడే యీ కృష్ణుడు
జొట జొట గారగానీ జుఱ్ఱీ మీగడలు || ఎటువంటి యాగ డీడే ||

చ|| కొట్టె క ృష్ణుడు వాడె కోలలెత్తి వుట్ల పై
దట్టముగ గొల్లెతలు దాచిన పాలు
చుట్టిన చక్కిలములు చొక్క పునురుగులును
బెట్టిన కాగుల తోనె పెంచలుగ జేసేనే || ఎటువంటి యాగ డీడే ||

చ|| దొంతులు దించి దించి దొంకొనీ కృష్ణుడు
బంతి చక్కెర వెట్టి గొపాలుల కెల్ల
మంతనానా వద్దని మాను పబోతే తాను
కొంతవారీ నోర పెరుగులు చమరీనే || ఎటువంటి యాగ డీడే ||

చ|| వీధులెల్లా తానే శ్రీ వేంకటాద్రి కృష్ణుడు
ఆది గొని మెసగీని అలుకు లెల్ల
కాదని పెనగి తేను కాగిలించీ గొల్లెతల
సోదించి కుచములంటీ సొంపుగా కూడేనే || ఎటువంటి యాగ డీడే ||

Advertisement

తాజా వార్తలు

Advertisement