Wednesday, April 24, 2024

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

రాగం : ధన్యాసి

ప|| ఉప్పవడము గాకున్నా రిందరు
యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు || ఉప్పవడము ||

చ|| కన్నుల చంద్రుడును కమలమిత్రుడును
వున్నతి నివి నీకుండగను
వెన్నెలయెండలు వెలయగ మేల్కొను
టెన్నడు నిద్దుర యెన్నడు నీకు || ఉప్పవడము ||

చ|| కందువ సతికనుగలువలు ముఖార
వింద ము ని దివో వికసించె
ముందర నిద్దుర మొలవదు చూచిన
విందగునీ తెలివికిదుదా యేది || ఉప్పవడము ||

చ|| తమము రాజసము తగుసాత్వికమును
నమరిన నీ మాయారతులు
కమలాధిప వేంకటగిరీశ నిన్ను
ప్రమదము మఱపును బ్తెకొనుటెట్లా || ఉప్పవడము ||

Advertisement

తాజా వార్తలు

Advertisement