Saturday, March 16, 2024

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

రాగం : రాగమాలిక

ప|| ఈ పాదమె కదా యిలయెల్ల గొలిచినది
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||ఈ పాదమే కదా ||

చ||ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది
ఈ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది
ఈ పాదమే కదా యెలమి పెంపొందినది
ఈ పాదమే కదా యిన్నిటికిని యెక్కుడైనది ||ఈ పాదమే కదా ||

చ||ఈ పాదమే కదా యిభరాజు దలచినది
ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
ఈ పాదమే కదా యీ బ్రహ్మ కడిగినది
ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది ||ఈ పాదమే కదా ||

చ||ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది
ఈ పాదమే కదా యిల నహల్యకు కోరికైనది
ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము
ఈ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||ఈ పాదమే కదా ||

Advertisement

తాజా వార్తలు

Advertisement