Tuesday, April 23, 2024

అన్నమయ్య కీర్తనలు

ఇందిరారమణుదెచ్చి
రాగం : శివరంజని

ప|| ఇందిరారమణు దెచ్చి యియ్యరో మా కిటువలె
పొంది యీతని పూజించ పొద్దాయ నిపుడు || ఇందిరారమణు ||

చ|| ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
నేరుపున మించిన అంజనీతనయా
ఘోర నాగపాశముల కొట్టివేసి యీతని
కారుణ్య మందినట్టి ఖగరాజ గరుడా || ఇందిరారమణు ||

చ|| నానా దేవతలకు నరసింహు కంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
మానవుడై కృష్ణమహిమల విశ్వరూపు
పూని బండి నుంచుకొన్న పోటుబంట అర్జునా || ఇందిరారమణు ||

చ|| శ్రీవల్లభునకు అశేషకైంకర్యముల
శ్రీవేంకటాద్రివైన శేషమూరితీ
కైవసమైనయట్టి కార్తవీర్యార్జునుడా
దేవుని నీవేళ నిట్టె తెచ్చి మాకు నియ్యరే || ఇందిరారమణు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement