Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : ఈతడువో రాముడు

ఈతడువో రాముడు ఏకాంగవీరుడు
ఏతలజూచి నా తానె ఇరవుకొన్నవాడు

చిరుతప్రాయమునాడు శివుని విల్లువిరచి
మెరసి సీతను పెండ్లాడి మించినవాడు
తరి పదునాలుగు వేల దానవుల నిమిషాన
జరసి తానొక్కడే చదిపినవాడు

ఓడక విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున
ఏడు తాళ్లు ధరను కూలవేసినవాడు
జాడగా కొండలచేత జలనిధి గట్టించి
వేడుకతో లంకమీద వి డిసినవాడు

రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి
ఈవల అయోధ్యాపట్నమేలిన వాడు
శ్రీ వేంకటాద్రిమీద జేరి మాల్యవంతమున
వేవేలు చందములను వెలసినవాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement