Saturday, April 20, 2024

అన్నమయ్య కీర్తనలు

ఈతడువో రాముడు

రాగం : రామక్రియ
ప|| ఈతడువో రాముడు ఏకాంగవీరుడు
ఏతలజూచి నా తానె ఇరవుకొన్నవాడు || ఈతడువో ||

చ|| చిరుతప్రాయమునాడు శివుని విల్లువిరచి
మెరసి సీతను పెండ్లాడి మించినవాడు
తరి పదునాలుగు వేల దానవుల నిమిషాన
జరసి తానొక్కడే చదిపినవాడు || ఈతడువో ||

చ|| ఓడక విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున
ఏడు తాళ్లు ధరను కూలవేసినవాడు
జాడగా కొండలచేత జలనిధి గట్టించి
వేడుకతో లంకమీద వి డిసినవాడు || ఈతడువో ||

చ|| రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి
ఈవల అయోధ్యాపట్నమేలిన వాడు
శ్రీ వేంకటాద్రిమీద జేరి మాల్యవంతమున
వేవేలు చందములను వెలసినవాడు || ఈతడువో ||

Advertisement

తాజా వార్తలు

Advertisement