Saturday, June 3, 2023

అన్నమయ్య కీర్తనలు : ఆడరమ్మ పాడరమ్మ

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
వేడుక పురుషలెల్ల వీధి నుండరమ్మ || ||ఆడరమ్మ పాడరమ్మ||

అల్లదివో ఓగునూతుల ఔభళేశు పెద్దకోన
వెల్లిపాల నీటి జాలు వెడలే సోన
చల్లని మాకులనీడ సంగడి మేడలవాడ
ఎల్లగాగ నరసింహుడేగీ నింతితోడ || ||ఆడరమ్మ పాడరమ్మ||

- Advertisement -
   

సింగారపు మండపాల సింహాల మునిమందలు
అంగపు తెల్లగోపురము అదె మిన్నంద
చెంగట నాళువార్లు చేరి పన్నిదరు గొల ్వ
సంగతి తా కొలువిచ్చీ జయనరసింహము || ||ఆడరమ్మ పాడరమ్మ||

కందువ శ్రీవేంకటేశు కళ్యాణముల వేది
అందమై భూమికెల్ల ఆదికినాది
మందల పాలకండ మలకు నట్టనడుమ
విందగు దాసుల తోడ విహరించీ దేవుడు || ||ఆడరమ్మ పాడరమ్మ||

Advertisement

తాజా వార్తలు

Advertisement