Friday, March 15, 2024

అన్నమయ్య కీర్తనలు : జవ్వాది మెత్తినది

రాగం : శంకరాభరణం

జవ్వాది మెత్తినది తన
జవ్వనమే జన్నె వట్టినది || ||జవ్వాది మెత్తినది||

ముద్దుల మాటలది చెక్కు –
టద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులది తన
వొద్ది చెలియ మీద నొరగున్నది ||జవ్వాది మెత్తినది||

పుత్తడిబోలినది తన
చిత్తము నీ సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అల
చిత్తజుని లెక్క సేయనిది || ||జవ్వాది మెత్తినది||

ఎమ్మెలు యెఱగనిది తన
కెమ్మోవి చిరునవ్వు కెరలున్నది
కమ్ముకొనగ వెంకటరాయా నీ
కమ్మని కౌగిట కలశున్నది || ||జవ్వాది మెత్తినది||

Advertisement

తాజా వార్తలు

Advertisement