Saturday, March 25, 2023

అన్నమయ్య కీర్తనలు : ఏలే ఏలే మరదలా

ఏలే ఏలే మరదలా
చాలు చాలు చాలును
చాలు నీతోడి సరసాలు బావ

- Advertisement -
   

గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
చీటికి మాటికి చెనకేవు వట్టి
బూటకాలు మాని పోవే బావ

అందిందె నన్ను అదలించి వేసేవు
మందమేలపు మరదలా
సందుకో తిరగేవు సటకారి ఓ బావ
పొందుకాదిక పోవే బావా

చొక్కపు గిలిగింత చూపుల నన్ను
మక్కువ సేసిన మరదలా
గక్కున నను వేంకటపతి గూడితి
దక్కించుకొంటివి తగువైతి బావ

Advertisement

తాజా వార్తలు

Advertisement