Wednesday, April 17, 2024

అన్నమయ్య కీర్తనలు : కంటి అఖిలాండకర్త

కంటి అఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి

మహనీయ ఘనఫణామణుల శైలము గంటి
బహు విభవముల మంటపముల గంటి
సహజ నవరత్న కాంచనవేదికలు గంటి
రహివహించిన గోపురంబులవె కంటి

పావనంబైన పాపవినాశనము గంటి
కైవశంబగు గగనగంగ గంటి
దైవికపు పుణ్య తీర్ధములెల్ల పొడగంటి
కోవిదులు కొనియాడు కోనేరుగంటి

పరమయోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజములు గంటి
తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి
తిరువేంకటాచలధిపు చూడగంటి

Advertisement

తాజా వార్తలు

Advertisement