Thursday, April 18, 2024

అన్నమయ్య కీర్తనలు : ఇతర మెరుగగతి

ఇతర మెరుగగతి ఇదియె శరణ్యము
సతత పూర్ణునికి శరణ్యము ||

సర్వలోకముల సాక్షైగాచిన
సర్వేశ్వరునకు శరణ్యము
ఉర్వికి మింటికి వొక్కటి చెలగిన
సార్వభౌమునకు శరణ్యము ||

శ్రీకాంతనురము చెంగట నిలిపిన
సాకారునకు శరణ్యము
పైకొని వెలిగేటి పరంజ్యోతియై
సౌకుమారునకు శరణ్యము ||

తగనిహ పరములు దాసులకొసగెటి
జగదీశ్వరునకు శరణ్యము
నగశ్రీ వేంకట నాధుడనీకు
సుగుణ మూర్తికిదె శరణ్యము ||

Advertisement

తాజా వార్తలు

Advertisement