Tuesday, May 30, 2023

అన్నమయ్య కీర్తనలు : ఆరగింపవో మాయప్పయివే


రాగం : ఖమాస్‌

ప|| ఆరగింపవో మాయప్పయివే
పేరిన నేతులు పెరుగులును ||

- Advertisement -
   

చ|| తేనెలు జున్నులు తెంకాయపాలును
ఆనవాలు వెన్నట్లును
నూనెబూరెలును నురుగులు వడలును
పానకములు బహు ఫలములను ||

చ|| పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును
కరజి కాయలును ఖండమండెగలు
పరిపరివిధముల భక్షములు ||

చ|| కడుమధురంబగు కమ్మబూరణపు
కుడుములు నిడ్డెన కుడుములును
సుడిగొనునప్పాలు సుగినప్పాలును
పొరిబెల్లముతో బొరటుచును ||

చ|| కాయపురుచులకు గనియగుమిరియపు
కాయలు నేలకికాయలును
పాయరాని అంబాళపుకాయలు
నాయతమౌ దద్ద్యన్నములు ||

చ|| ఒడియపుకూరలు ఒలుపు ప ప్పులును
వడియాలపు రాజాన్నములు
బడిబడి కనకపు పళ్ళెరములతో
కనువేడుకన వేంకటరమణా ||

Advertisement

తాజా వార్తలు

Advertisement