Friday, March 29, 2024

అన్నమయ్య కీర్తనలు : ఆరగించి


రాగం : ఆరభి

ప|| ఆరగించి కూచున్నా డల్లవాడె
చేరువనే చూడరె లక్ష్మీ నారసింహుడు ||

చ|| ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లిd నల్లవాడె
చెందిన మాణికముల శేషుని పడగమీద
చెంది వరాలిచ్చీ లక్ష్మీ నారసింహుడు ||

చ|| బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచి నల్లవాడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీ నారసింహుడు ||

చ|| పెండెపు పాదము చాచి పెనచి ఒకపాదము
అండనే పూజలుగొనీ నల్లవాడె
కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement