కదిరి నృసింహుడు కంభమున వెడలె
విదితముగా సేవింపరో మునులు
- Advertisement -
ఫాలలోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలచె
ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడ నదరెటి కటములును
నిడుద నాలుకయు నిక్కు కర్ణములు
అడియాలపు రూపై వెలసె
సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూని
వెకలి యగుచు శ్రీ వేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించె నిదివో