Saturday, October 12, 2024

అన్నమయ్య కీర్తనలు : అలకలు చెల్లవు హరి

అలుకలు చెల్లవు హరిపురుషోత్తమ
నలి నిందిర నీతో నవ్వినది ||

ఆదిలక్ష్మి మోహన కమలంబున
వేదమాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును
సాదరమున గడు చాచినది ||

సి రి దన కన్నుల చింతామణులను
పొరి నీపై దిగబోసినది
వనద హస్తమున వలచెయి వట్టుక
అరుదుగ నిను మాటాడించినది ||

జలధి కన్య తన సర్వాంగంబుల
పిలిచి నిన్ను నిటు పెనగినది
అలముక శ్రీ వేంకటాధి నిను రతి
నెలమి నీ పురంబెక్కినది ||

Advertisement

తాజా వార్తలు

Advertisement