Monday, October 14, 2024

అన్నమయ్య కీర్తనలు : ఆకటి వేళలు

రాగం : శుభాళి

ప|| ఆకటి వేళలు అలపైన వేళలను
తేకువ హరినామమే దిక్కుమరి లేదు ||

చ|| కొఱమాలి యున్న వేళ కులము చెడినవేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతిగాక
మఱచి తప్పిననైన మఱిలేదు తెరగు |

చ|| ఆపద వచ్చిన వేళ ఆరడిబడిన వేళ
పాపపు వేళల భయపడినవేళ
వోపినంత హరినామమొక్కటే గతిగాక
మాపుదాకా పొరలిన మరిలేదు తెరగు

చ|| సంకెల బెట్టిన వేళ చంపబిలిచిన వేళ
అంకిలిగా నస్పుల వారాగిన వేళ
వెంకటేశు నామమే విడిపించగతిగాక
మంకుబుద్ధి పొరలిన మరిలేదు తెరగు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement