Saturday, October 12, 2024

అన్నమయ్య కీర్తనలు : అరంత మహిముడవు

రాగం : అమృతవర్షిణి

ప|| అనంత మహిముడవు అనంత శక్తివి నీవు
ఎనలేని దైవమా! నిన్నేమని నుతింతును ?

చ|| అన్ని లోకములు నీ యందునున్న వందురు నీ
వున్నలోక మిట్టిదని వూహించరాదు
ఎన్ననీవు రక్షకుడ విందరిపాలిటికి
నిన్ను రక్షించేటివారి నే నెవ్వరినందును

చ|| తల్లివి దండ్రివి నీవు తగు బ్రహ్మాదులకు
ఎల్లగా నీ తల్లిదండ్రు లెవ్వరందును
ఇల్లిదె వరములు నీ విత్తు విందరికిని
చెల్లబో నీ కొకదాత చెప్పగజోటేది

చ|| జీవుల కేలికవు శ్రీ వేంకటేశుడవు నీ
వేవల జూచిన నీకే యేలికే లేడు
వేవేలు మునులును వెదకేరు నిన్నును
నీ వెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి

Advertisement

తాజా వార్తలు

Advertisement