Friday, April 19, 2024

అన్నమయ్య కీర్తనలు : అదెద చూడరే మోహన

రాగం : మోహన

ప|| అదె చూడరే మోహన రూపం
పది కోట్లు గల భావజరూపం ||

చ|| వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘనమోహన రూపం
వలచిన నందవ్రజము గొల్లెతల
కులుకు చూపులకు గురియగు రూపం ||

చ|| ఇందిరా వనిత నెప్పుడు తన పుర
మందు నిలిపిన మోహన రూపం
కందువ భూసతి కౌగిటి సొంపుల
విందులు మరిగిన వేడుక రూపం ||

చ|| త్రిపుర సతుల బోధించి రమించిన
అపురూపపు మోహనరూపం
కపురుల శ్రీ వేంకటపతియై ఇల
ఉపమించగరాని వున్నత రూపం ||

Advertisement

తాజా వార్తలు

Advertisement