Thursday, April 25, 2024

అన్నమయ్య కీర్తనలు : పాడైన ఎరుకతో

రాగం : లాస్యవతి

పాడైన ఎరుకతో బంధమోక్షము లొక్కగాడి గట్టుట తెలివి గానకే కదా || || పాడైన ఎరుకతో||

భావించి నిను పరబ్రహ్మమని వేదములు
వేవేలు విధుల మొరవెట్టగాను
కేవలపు నిన్ను తక్కిన దైవముల గూర్చి
సేవింపుటిది తప్పు సేయుటే కాదా || || పాడైన ఎరుకతో||

సరిలేని నిను నుపనిషద్వాక్యములె పరా
త్పరుడవని నలుగడల పలుకగాను
వరుసతో పెక్కుదైవముల సంగడి నిన్ను
తొరల కొలుచుట మహాద్రోహమే కాదా|| || పాడైన ఎరుకతో||

- Advertisement -

ఎందుజూచిన పురాణతిహాసములు నీ
చందమే అధికమని చాటగాను
కందర్ప జనక వేంకటగిరి స్వామీ నీ –
కందు వెఱగనిది యజ్ఞానమే కాదా || || పాడైన ఎరుకతో||

Advertisement

తాజా వార్తలు

Advertisement