Friday, March 29, 2024

అన్నమయ్య కీర్తనలు : నమో నమో రఘుకుల

నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య
నమో నమో శంకర నగజానుతా
విహితర్మ పాలక వీరదశరథరామ గహనవాసినీతాటక మర్దన
అహల్యాశాప విమోచన అసురకుల
భంజన సహజ విశ్వామిత్ర సవనరక్షకా
హరకోదండధర సీతాంగనా వల్లభ ఖరదూషణాది వాలిగర్వాపహా
తరణి తనూజాది తరుచర పాలక శరధి లంఘనకృత్యసౌమిత్రి సమేతా
బిరుదరావణశిరో భేదక విభీషణ వరదసాకే తపురవాసరాఘవ
నిరుపమ శ్రీ వేంకట నిలయ విజయనగర పుర విహార పుండరీకాక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement