Wednesday, November 30, 2022

అన్నమయ్య కీర్తనలు : కులుకక నడవరో

ప|| కులుకక నడవరో కొమ్మలాలా ||కులకక||
జలజల రాలీని జాజులు మాయమ్మకు

- Advertisement -
   

చ|| ఒయ్యనే మేను కదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీ పాదతాకు కాంతాలాలా
పయ్యెద చెరగు జారీ భారపు గుబ్బలమీద
అయ్యో చెమరించీ మాయమ్మకు నెన్నుదురు||కులకక||

చ|| చల్లెడి గందవొండి మైజారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు పణతులాలా
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు ||కులకక||

చ|| జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల ఆరతు లెత్తరో
అమరించి కౌగిట అలమేలు మంగ నిదె
సమకూడె వెంకటేశ్వరుడు మాయమ్మకు ||కులకక||

Advertisement

తాజా వార్తలు

Advertisement