Thursday, December 1, 2022

అన్నమయ్య కీర్తనలు : ఎంతపుణ్యమో

ప|| ఎంత పుణ్యమో యిటు మాకు కలిగె
చెంతనె నీకృప సిద్దించ బోలు || ఎంత ||

- Advertisement -
   

చ|| శ్రీపతి నీకథ చెవులను వింటిమి
పాపములణగెను భయముడిగె
తీపుగ తులసీ తీర్థము గొంటిమి
శాపము దీరెను సఫలంబాయ || ఎంత ||

చ|| గోవిందా మిము కనుగొంటి మిప్పుడే
పావనమైతిమి బ్రతికితిమి
తావుల మీ పాదములకు మొక్కితి
వేవేలు కలిగెను వేడుకలాయ || ఎంత ||

చ|| శ్రీ వేంకటేశ్వర సేవించితి మిము
ధావతి తీరెను తనిసితిమి
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి
నీవారమైతిమి నిలిచితి మిపుడు || ఎంత ||

Advertisement

తాజా వార్తలు

Advertisement