Thursday, April 25, 2024

అన్నమయ్య కీర్తనలలో మానవ జీవన సరళి…

కలియుగ వరదుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి నిజ భక్తుడు, వాగ్గేయ కారుడు, గోవిందుని దివ్య భక్తుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు. వేలాదిగా మనోజ్ఞమైన కీర్తనలు రచించి ముక్తిని పొంది నాడు. ఆయన కీర్తనలందు కల మానవుల, జీవుల రీతుల ను సందేశాత్మకంగా పొందుపరచబడినవి. అది జీవుల పూర్వజన్మ పరిపాకము. ఆయన కీర్తనలలో ఆధ్యాత్మిక- భక్తి- శృంగార- జానపద- కల్యాణ- లాలి పాటలు నేటికీ జనుల నాలుకలపై గాన రూపంలో నర్తిస్తూనే ఉన్నాయి.
మానవ జీవనం అశాశ్వతమైనది. శాశ్వతమైనది భగవంతునిపై భక్త యొక్కటే అంటూ, అందరూ ఈ సత్యమును తెలిసికొని, ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ, సమతా భావన కల్గియుంటూ, కలిమాయలో జీవుల బ్రతుకంతయూ ఒక నాటకం అంటూ, ఇదంతా విష్ణు మాయ అని తన కీర్తనల ద్వారా సందేశాన్ని అందించా డు. ”నానాటి బ్రతుకూ నాటకం కానక కన్నది కైవల్య మ”ని తెలుసుకోమన్నాడు.
కలి జనులకు కులము- మతము- కలమి- తలపు- నెలవు- తనువు మనుగడ అన్నీ భగవంతుడే. వెనుక ముందు మానవులకు గతి- భృతి- శ్రీమతి- ధృతి అన్నీ నారాయణుడేయన్నాడు. సంసార బంధములు వీడవలె నన్న అంతరంగమును శ్రీహరికి అర్పించి సుఖపడమ న్నాడు. సృష్టిలో జీవులకు అన్నీ యిచ్చువాడు ఆ హరియే. పెంచునది పోషించునదీ లయింపజేయునది అంటే చి వరకు తన కడకు చేర్చేదీ ఆయనయే గదా! చిత్త శాంతికీ, బంధ విమోచనానికీ పరమౌషధము ఆ వెన్నుని నామమే. హరినామమే కడు ఆనందకరమన్నాడు.
అభయ దాయకుడు- బంధ విమోచనుడు- పాప వినాశకుడు- వరదుడు- ఆశ్రిత రక్షకుడు ఆ హరియే గాన ఆయన భావములోనేగాక, బాహ్యములో గూడా స్మరిం చి- తరించి జన్మలను ధన్యం చేసుకోమనినాడు. అందరికీ ప్రాణమైనవాడు, ఆదిమూలమైన ఆ హరినే శరణువేడుట మంచిదన్నాడు. మానవులు నిజ జీవితంలో తెలుసుకో దగిన సత్యమిదియేనని చాటినాడు. జీవులు ఆకలి వేళల- అలసిన వేళల- కొఱమాలియున్న వేళ- కులము చెడిన వేళ- శత్రువుల చేత బంధింపబడిన వేళ హరినామమమే దిక్కు అన్నాడు. కష్టసుఖాలలో, పాపం చేత భయపడి న వేళ హరినామమే జీవులకు గతియని వక్కాణించినాడు.
గతి— మతి- కర్త- భర్త- పతివి అన్నీ నీవే ఇంకమాకె వరున్నారు? మమ్ములను కాపాడుటకు అంటూ ఆ హరినే శరణు వేడమన్నాడు. తల్లి- తండ్రి- గురువు- దైవం- వుని కి- మనికి అన్ని నీవేనని ప్రార్థించాలి. అప్పుడే అందరికీ అభ యమిచ్చి కాపాడుతాడు. ఇంతకంటే ఘనము యిలలో ప్రాణులకు మరేదీ లేదు. ఇది వేదోక్తమైన సత్యము. నిరం తరము నారాయణుని నామము దలచుటే సారపు చదువు లు. శాస్త్రములుగాన హరి సేవయే జీవులకు ఆలంబన.
వలనంటే బంధము- వలదంటే మోక్షము ఇది తెలి సినవారే విజ్ఞానులన్నాడు. పుట్టుట సంశయము- పోవుట నిశ్చయమనీ. ఈ నమ్మిక అందరూ కల్గియుండాలన్నాడు. అప్పుడే శాంతి సుఖాలు లభిస్తాయి. ఇహపరముల కర్త ఆ హరియే గదా! ఇహపర సాధనము హరి నామస్మ రణయే. భవసాగరమును దాటించునది, జీవుల దు:ఖమును పో గొట్టే మృత సంజీవని హరినామమే. నీ పాదాలను శరణ జొచ్చినవారికి ఇహపరాలుండవు. ప్రకృతి అంతయూ హరిమాయే. హరిమాయలో కలియుగం అంతా చిక్కి యున్నదిగాన హరియే అంతా. అన్నిటికీ ఆ శ్రీనివాస పర బ్రహ్మమే. దైవమని నమ్మి సేవానంద పరులయి జీవనం సాగించాలని ఒక కీర్తనలో తెలిపాడు అన్నమయ్య.
జీవుల విషయాలను విశదీకరిస్తూ, జీవులు ప్రాణం తో వున్నన్ని రోజులు బంధములు పాయవు. ఆశలు వదల వు. కోరికలు తొలగవు. కోపములు వదలిపోవు. హంగు ఆర్భాటములు తప్పవు. ఒక దానితో ఒకటి కలిసివుండవు. సకలం హరియేయని నమ్మి శరణు అంటే అన్ని వికటము లు అణగిపోతాయి. వేదాంతపరంగా ఒక కీర్తన రచిస్తూ ”ఎవ్వరెవ్వరిడే ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు” అంటూ గత జన్మలలో కొందరికి కొడుకుగా, తోబుట్టువు గా జనించి అందరినీ భ్రమింపజేస్తాడు. ఎందరికో దు:ఖ మును కల్గిస్తూ వుంటాడు. వెనుక జన్మలలో ఎక్కడెక్కడో తిరిగాడు. తన జన్మ ఎక్కడో తెలియదు. బంధువులు, స్నే#హతులు తెలియదు. ఎప్పుడెక్కడికి పోవునో ఈ జీవుడు తెలుసుకోలేడు. ఇది జీవన సత్యం. వెనుక ఎన్ని దేహాలు ధరించినాడో, ఎన్నెన్ని మోసినాడో, ఎన్ని పదవులు పొంది నాడో, ఇవన్నియు శ్రీ వేంకటేశ్వరుని మాయలతోనే చిక్కి జీవనం సాగిస్తున్నాడు.
సద్గుణములను పొందవలెనన్న కులమతాలతో సం బంధంలేదు. హరినెరిగిన వాడైతే చాలు. పరదూషణ- నింద పనికిరాదన్నాడు. సత్యసంపన్నుడు కావాలి. సర్వ భూతదయతో మనసు నిండివుండాలి. పరులుతానేయని భావించువాడే హరినెరిగిన వాడు. ఆత్మనియతిగల్గి, నిర్మ లుడై, ధర్మ పరుడై, సద్బుద్ధి తో మెలగమన్నాడు. హరి భక్తి మరువక కర్మమార్గములు కడవనివాడై యుండాలి. జగతిలో హితముగా చరిస్తూ, శత్రుత్వ భావన లేకుండా జీవించుటే సద్గుణము అన్నాడు.

హరి మాయకు ఆద్యంతములు లేవు. జీవులకు ఎన్నో బాధలు- లంపటములు- ఆశలు- మోహములు- గర్వములు – దైన్యములు ఎన్నో వుంటాయి. వేటికి చిం తిస్తాడు. వేటికి హర్షిస్తాడు. ఎన్నిటిని ఆశిస్తాడు. ఎన్నిటి కోసం తిరుగుతాడు. ఇవన్నియూ ఆ హరి లీలలేయని మనసారా ఎరిగి ప్రవర్తించి హరి చింతనలో జీవనం కొన సాగించమని ఆశించాడు. జీవులు పాట్లకు లోనుగాకుం డా, పరుల మనసులకు ఆపదలు కలుగజేయక, పరితపి స్తూ బ్రతుకరాదు. ఇతరుల మేలు జూచి ఈర్ష్య చెందరాదు. పరులకు మేలు చేయు సంస్కారమే సద్విద్య అన్నాడు. మనశ్శాంతి లేని చదువులేలయన్నాడు. భ్రాంతిని తొల గించుకొని భగవంతుని ఆత్మ తత్త్వమును తెలియుమన్నా డు. హరినొల్లని వారిని అసురులు అన్నాడు.

‘బ్రహ్మమొక్కటే- పరబ్రహ్మమొక్కటే’ అనే కీర్తనలో సమతాభావమును చాటి చెప్పినాడు. జీవులకు హీనం- అధికం వుండరాదు. అందరూ ఒకటే యన్నాడు. రాజు- బంటు- బ్రాహ్మణుడు- చండాలులకు సరియైన భూమి స్మశానమే అంటూ ఏకత్వ భావన తెలిపాడు. దేవతలకూ, కీటకాలకూ, మానవులకు కామసుఖమొకటేనన్నాడు. ఆకలి- ఆశలూ అందరికీ ఒకటే. గాలి- పరిమళము అంద రికీ ఒకటే. సూర్యుని ఎండ అన్ని జీవులపై ఒకే రీతిగా పడు తుందనీ తెలిపినాడు. పుణ్యులనూ, పాపకర్ములనూ కాచి రక్షించేది ఆ వెంకటేశుని నామమొక్కటేనన్నాడు.
మరొక కీర్తనలో మనుజుడై పుట్టి మనుజుని సేవించి, అనుదినమును దు:ఖమందనేలా” అంటూ పట్టెడు కూటి కై మానవుడు పలు పాట్లు పడుతూ, సంసార లంపటంలో తగులుకుంటున్నాడు.విరిజాతులన్నియునూ వృథాయం టూ, జాతి బేధములు, శరీర గుణములు, జాతి శరీరము తోడనే చెడిపోతాయి అంటూ హరిసేవలో పునీతులు కా వాలన్నాడు. ఈ ధరణిలో జాతి బేధములెంచరాదనీ, పర మ యోగులు ఈ భావనని భవ వికారమని, దానిని వదలి ధర్మములకు అని సుజాతియని ఆ పరతత్వ విదుడైన పర మాత్మను సేవించి ధన్యులైనారని తెలిపారు.
కలి జీవులందరి బ్రతుకులు ఆ హరియే యెరుగును గాన, ఆ పరమాత్మనే తెలిసికొని సుఖించుట మంచిదని ప రిష్కార మార్గమును కూడా తన కీర్తనలలో పొందు పర చిన అన్నమయ్య మానవజాతికి మార్గదర్శకుడైనాడు.

హరిభక్తితో తరించిన ధన్యజీవి- పుణ్యజీవి. కలియు గవరదుని హృదయాంతరంగ భక్తుడై ముక్తి పొందిన వాగ్గేయకారుడు. హరి అవతారమీతడు అన్నమయ్య యనీ, తనకు గురుడీతడని చిన తిరుమలాచార్యుల వారు ప్రశంసించినారు. ”కలి దోష హరము కైవల్యము శ్రీనలి నాక్షుని శ్రీ నామమ”ని కీర్తించి స్మరించి- గానంచేసి, ఫల సారము పొందిన ధన్యజీవి అన్నమయ్య. ఆయన రచిం చిన వేలాది కీర్తనలో ఎన్నో మానవ జీవుల సరళిని తెలిపేవి వున్నాయి. మచ్చుకు కొన్ని పాఠకులకు తెలుపుట నా భా గ్యంగా తలచి, ఆ పాట ల భావాలను అందించే చిరు ప్రయత్నమిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement