Tuesday, March 26, 2024

శివపూజకు ఉత్తిష్టముసోమావతి అమావాస్య

దే సోమవారం నాడు అమావాస్య కలిసి వచ్చే దినాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఈ అమావాస్యను మౌని అమావాస్య, శని అమావాస్య అనికూడా పిలుస్తారు. రావిచెట్టులో ఎల్లప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరి ఉంటారు. శివుడికి సోమవారం ప్రీతి, సోమవతి అమావాస్య శివ పూజకు ఉద్దిష్టమైన దినం. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. చంద్రుని ధరిస్తాడు కనుక శివుని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఈ రోజున రావిచెట్టుకు శక్తి కొలది పూజించాలి. అమావాస్య అంటే కారు చీకటి మరుసటి రోజునుండి శుక్లపక్షం ప్రారంభం అంటే మన ప్రయాణం పౌర్ణమి అంటే వెలుగు వైపు ప్రయా ణం చేస్తుంది. అందుకే అమావాస్య రోజు దైవభక్తితో సత్కా ర్యాలు చేస్తూ భగవత్‌ ఉపాసకులు కావాలని సూచిస్తుంది.
దీనికి సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా దక్షయజ్ఞం కథ. తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది.
సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రు డయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితక బాదా డు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు.
చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధల కు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు.
చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ, ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.
శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది.

వ్రతాలు

సోమవారం- అమావాస్య కల్సివచ్చిన రోజున ఆడ వారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు. సర్పదోషం ఉన్న వారు, జాతకంలో ఉన్న గ్రహా దోషాలు తొలగి పోవడానికి, అమావాస్య రోజున పెళ్ళి అయిన వారు, పెళ్ళికోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు భక్తి శ్రద్ధలతో 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ పూజించాలి. ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు సంతృప్తి చెంది మేలు చేస్తారని పెద్దలు చెబుతారు.
సోమావతి అమావాస్య రోజున శారీరక శక్తి కలిగినవారు ఉపవాసం చేసి శక్తి కొలది పేదలకు, ఆకలితో ఉన్న ఏ జీవరాశులకైన ఆహా ర పానీయాలు అందిస్తే జాతకంలో ఉండే గ్రహ దోషాలు శాంతిస్తాయని ప్రతీతి. పూజలు ఆర్ధిక శక్తి స్థోమత, సామర్ధ్యాలను బట్టి చేయాలి తప్ప, అప్పులు చేసి పూజ చేస్తే ఫలితం ఉండ దు. ఏదైన ధర్మబద్ధమైన కష్టార్జితంతో చేసే దానికే శుభఫలితాలు ఉంటాయి.
ఒక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి. అశ్వత్థ(రావి) వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.
మూలతో బ్రహ్మరూపాయ… మద్యతో విష్ణురూపిణే…
అగ్రత శ్శివరూపాయ… వృక్షరాజాయతే నమ:
అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పు న 108 సార్లు శ్లోకం చదువుతూ, నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి. చివర్లో ఒక పండో ఫలమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి. అలా 108 అమావాస్య సోమవారాల య్యాక ఉద్యాపన చేసుకోవాలి.
అలా 108వ అమావాస్యా సోమవారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత, వృక్ష మూలంలో బియ్యం తో మండపం ఏర్పరిచి శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి ఆరాధించాలి. ముత్తయిదువలకు ఫలా లను వాయన దానమివ్వాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement