Wednesday, April 24, 2024

అభిషిక్తుడైన యాదాద్రీశుడు

మూడవ రోజుకు చేరుకున్న పంచకుండాత్మక యాగం
మూర్తి స్వరూపాలకు షోడశ కలశాభిషేకం
పంచామత లక్ష్మీస్వరూపాదులతో పంచగవ్యాధివాసం
ద్వారతోరణం… ధ్వజకుంభారాధనలు
భగవత్‌ ప్రీతికరంగా మహాకుంభ సంప్రోక్షణాంతర్గత ఉత్సవం

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయ పున: ప్రారంభ మహాకుంభ సంప్రోక్షణ నేపథ్యంలో బాలాలయంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న పంచకుండాత్మక మహా యాగం బుధవారం నేత్రపర్వంగా మారి ంది.ప్రధానాలయ ముఖ మండపంలోని ఉపాలయంలో ప్రతిష్టిం చనున్న ఆండాళ్‌ అమ్మవారు, ఆళ్వార్‌ విగ్రహాలు, అలాగే పున: ప్రతిష్టించనున్న దివ్య విమాన గోపుర సుదర్శన చక్రానికి ప్రధానార్చక బృందం షోడశ కలశాభిషేకం నిర్వహించారు. సర్వ దోష నివారణకు షోడశ గుణానుభవంతో గోమూత్రం, పంచామృతాలతో అభిమంత్రించారు. మూర్తి (బింబ) స్వరూపాలలోని సర్వ దోష నివారణకు ఈ క్రతువును నిర్వహించారు. షోడశ కలశాభిషేకంతో మూర్తి స్వరూపాలన్నీ తేజోవంతాన్ని సంతరించుకున్నాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం మంత్రములన్నీ పరమాత్ర స్వరూపాలని, మంత్రాధీనమైన దైవాన్ని విశ్వశాంతి, లోకకల్యాణార్థం షోడశోపచారాలు ఎంతో వేడుకగా కొనసాగి ంచారు. ఆలయ ప్రధానార్చకులు నల్ల న్‌థీఘల్‌ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతుండగా ఆలయ ఈవో ఎన్‌ గీత, అనువంశిక ధర్మకర్త బి నర్సింహమూర్తి, ప్రధానార్చకులు మరింగంటి మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, భట్టర్‌ సురేంద్రాచార్యులు, మరింగంటి శ్రీధరాచార్యులు, ఆలయ అధికారులు గజవెల్లి రమేష్‌బాబు, దోర్భల భాస్కరశర్మ, వేముల రామ్మోహన్‌, గట్టు శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
ద్వారతోరణం… ధ్వజకుంభారాధనలు
శాంతిపాఠంతో బాలాలయంలో అభిషేకాలు ప్రారంభించి చతు:స్థానార్చనలు గావించారు. ద్వారతోరణ, ధ్వజకుంభారాధనలతో బాలాలయం అపర వైకుంఠాన్ని తలపించింది. మూలమంత్ర, మూర్తిమంత్ర హవనములు గావించారు. అనంతరం స్వయంభువు ప్రధానాలయం చెంత షోడశ కలశాభిషేకాన్ని 16 కలశాల తో భగవత్‌ ప్రీతికరంగా కొనసాగించారు.
పంచగవ్యాధివాసం
సంప్రోక్షణలో కీలకమైన పంచగవ్యాధివాసాన్ని సాయంత్రం వేళ అత్యంత పవిత్రంగా నిర్వహించారు. నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పంచదార, గోమూత్రాదులను లక్ష్మీ స్వరూపంగా భావించడం తెలిసిందే. అందుకే ఆయా అధివాస మంత్రములతో ఆవాహన గావించి మూర్తి (బింబ) స్వరూపాలకు సంప్రోక్షణాదులను ముగించారు.
యాగంలో నేటి విశేషం
24వ తేదీ గురువారం ఉదయం శాంతి పఠంతో పూజలు ప్రారంభించి చతుస్థానార్చన, మూలమంత్ర హవనములు, పంచవింశతికలశస్నపనం, నిత్యలఘుపూర్ణాహుతి, సాయంత్రం వేళ సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణణం, మూలమంత్ర హవనములు, చతు:స్థానర్చనలు, జలాధివాసం, నిత్యలఘుపూర్ణాహుతి చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement