Wednesday, April 24, 2024

7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల, ప్రభ న్యూస్‌ : ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవా లను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ‘టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా ఆంక్షల నేప ధ్యంలో గతేడాది లాగే ఈ ఏటా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలోనే ఉత్స వాలను నిర్వహిస్తుండడంతో సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబైంది. ఉత్సవ శోభ తెలిసేందుకు విద్యుత్‌ దీపాలంకరణ మాత్రం తిరుమలలోని ముఖ్యమైన కూడళ్లలో సర్వాంగ సుదరంగా ఏర్పాటు చేశారు. శ్రీనివాసుడు స్వయంబుగా వెల సిన తిరుమల కొండ పై బ్రహ్మోత్సవ సందడి ప్రారం భమైంది. ప్రతి ఏటా కన్యామాసం శ్రీవారి జన్మనక్షత్ర మైన శ్రవణా నక్షత్రం నాడు ముగిసేవిధంగా బ్రహ్మో త్సవాలు నిర్వహించడం ఆనవాయితీ కావడంతో ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే మహా సంబరా లను వైభవో పేతంగా నిర్వహించేందుకు టీటీడీ వేగంగా ఏర్పాట్లును చేస్తోంది. కరోనా నేపథ్యంలో కేంద్ర ఆంక్షల మేరకు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవా లను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించ డంతో గతంలోలా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని వాహన సేలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లేదు. శ్రీవారి ఆలయం లోని సంపంగి ప్రాకారం లోని కల్యాణ మండ పంలో ఉత్సవాలను నిర్వ హిస్తుండడంతో కేవలం ఆలయ జీయర్లు, అర్చ కులు, ఆలయ అధికా రులు, పాలకమండలి మధ్యే ఉత్సవాలను నిర్వ హించనున్నారు.అలంకా ర ప్రియుడైన శ్రీనివాసుడు 9 రోజుల పాటు 16 వాహ నాల పై కొలు వుదీరనున్నారు. ఉత్సవాల ప్రారంభా నికి ముందు వచ్చే మంగళవారమైన అక్టోబర్‌ 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనున్నది. మహా గోపురం నుంచి బంగారు వాకిలిలోని కుల శేఖర పడి వరకు అర్చకులు, ఆలయ సిబ్బంది శుద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఉత్సవాల ప్రారంభానికి సూచికగా ఆరవ తేది సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరగ నున్నది. ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుం డడంతో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమ ర్పించే కార్యక్రమంలో టీటీడీ మార్పులు చేసింది. గతంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పిస్తుండగా ఈ ఏట మొదటి రోజు కాకుండా శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనం సేవ నాడైన 11న సిఎం జగన్‌ ప్రభుత్వం తరపున శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు ఈ సందర్భంగా అలి పిరి వద్ద నిర్మించిన గోశాలను జగన్‌ చేత ప్రారంభం చేయడంతో పాటు తిరుమలలో ఆలయం వెలుపల అధునీకరించిన పోటును కూడా సిఎం చేత ప్రారం భించనున్నారు. మొత్తానికి బ్రహ్మోత్సవాల సమ యాన భక్తులతో కిటకిటలాడే సప్తగిరుల పై ఈ ఏట కూడా కరోనా నేపథ్యంలో భక్త జన సందడి లేకుండానే ఉత్సవాలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement