Thursday, April 25, 2024

అన్నమయ్య కీర్తనలు : విజాతులన్నియు వృధా వృధా

విజాతులన్నియు వృధా వృధా
అజామిళాదుల కదియే జాతి || విజాతులన్నియు వృధా వృధా ||

జాతిబోధములు శరీర గుణములు
జాతి శరీరముతోడనే చెడు
ఆతుమ పరిశుద్ధం బెప్పుడును అది నిర్దోషం బనాది
యీతల హరి విజ్ఞానపు దాస్యంబిది యొక్కటే పో సుజాతి || విజాతులన్నియు వృధా వృధా ||

హరి యిందరిలో నంతరాత్ముడిచె
ధరణి జాతిబేధము లెంచిన
పరమ యోగు లీభావ మష్టమదము భవవికారమని మానిరి
ధరణిలోన పరతత్వజ్ఞానము ధర్మమూలమే సుజాతి || విజాతులన్నియు వృధా వృధా ||

లౌకికవైదిక లంపటులకు నివి
కైకొను నవశ్య కర్తవ్యంబులు
శ్రీకాంతుడు శ్రీ వేంకటపతి సేనను సంపాద మిందరికి
మేకొని యిన్నియు మీరినవారికి మీ నామే పో సుజాతి || విజాతులన్నియు వృధా వృధా ||

Advertisement

తాజా వార్తలు

Advertisement