Friday, April 19, 2024

హిత వచనాలే శ్రేయోమార్గం

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, నీతి నియమాలకు మూలం వేదాలే. ఇది అందరూ ఒప్పుకునే నగ్న సత్యం. అందుకేనేమో శ్రీ దాశరథి రంగాచార్యులవారు ‘వేదం జీవననాదం’ అనే గ్రంథం రాశారు. మానవుని జీవితంపై సంస్కృతి సంప్రdదాయాలతో పాటు నీతి నిజాయితీలు కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మనకు తెలిసి గుర్తుకు రాని మంచి మాటలు ఎవరు చెప్పినా విని ఆచరణలో పెడితే సుఖ సంతోషాలతో గడపవచ్చు.
రామచరిత మానస్‌లో తులసీదాసు రామాయణంలోని ఒక ఘట్టాన్ని ఈ విధంగా వివరించాడు. సీతాదేవిని విడిచి పెట్టమని విభీషణుడు చెప్పే హిత వచనాలను రావణుడు పెడచెవిన పెడతాడు. సీతాదేవిని అప్పగించడానికి ఇష్టపడడు. దానిని తుసీదాసు ఈ విధంగా వర్ణించారు.
‘హిత్‌ మత్‌ తోహి న లాగత్‌ కైసే
కాల్‌ విబస్‌ కహు భేసజ్‌ జైసే’
మర ణానికి చేరువైన వారు, వైద్యుడు పరీక్షించి ఇచ్చిన మందులు వాడడానికి ఏ విధంగా అసలు ఇష్టపడరో మేలు కోరి చెప్పే మంచి మాటలు, దుష్ట స్వభావులకు అస్సలు రుచించవు. వారు కేవలం కీడు కలిగించే మాటలు వినడానికే ఇష్టపడతారు. అందుకు కారణం వారిలోని చెడు గుణాలే! అని పోలిక చెబుతాడు తులసీదాసు. అపుభవజ్ఞులు, సాధు స్వభావులు చెప్పే మాటలపై శ్రద్ధ చూపలేనివారు ఏదో ఒక రోజు నష్టాల పాలు కాక తప్పదనేది ఆయన రాసిన పద్యం అంతరార్థం.
ఒకరి మేలు, క్షేమం, హితం కోరి చెప్పే మంచి మాటలు, హితోక్తులు, సత్యవాక్కులుగా పిలువబడతాయి.
ఋషులు, మునులు, మహాత్ములు, అనుభవజ్ఞుల నోట వెలువడే మాటలు గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మనిషిి నిత్య జీవితంలో ఉపయోగపడే ఆ హితోక్తులు ఆయన్ని ముందుకు నడిపించి సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెడతాయి.
హితోక్తులు వేరువేరు పేర్లతో పిలువబడతాయి. ఆధ్యాత్మిక వాదులు ప్రవచనకారుల వాక్యాలను దివ్యబోధగా పిలుస్తారు. అదే మిత్రులు, శ్రేయోభిలాషుల మాటలను ఆప్త వాక్యం అంటా రు. జ్ఞానాన్ని ప్రసాదించే గురువు వాక్కు జ్ఞాన బోధ. భగవానుడు స్వయంగా అందించే సూక్తులను వాక్య విభూతి అంటారు.
మంచి మాట జీవితాన్ని బాగు చేస్తుంది. చెడు దారుల నుంచి తప్పించి మంచి మార్గాన్ని నిర్దేశిస్తుంది. దు:ఖితులకు మంచి మాట ఓ సాంత్వన. ఓదార్పునిచ్చే ఆపన్న హస్తం. కన్నీరు తుడిచే అభయ హస్తం. పరాజయాల నుంచి విజయాలవైపు పయనించే వారికి మంచి మాట ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. మనో ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.
భగవానుడు గురువుగా, జ్ఞాన బోధ చేయడం వల్లనే కదా మహాభారత యుద్ధంలో దుష్టులైన కౌరవులను దునుమాడేందు కు ముందు ఆవరించిన కుంగుబాటును దూరం చేసుకుని అర్జునుడు అధర్మాపికి తావులేదని, దుష్టులు ఎప్పుడూ ప్రశాంతంగా జీవింపజాల రని నిరూపించి చరితార్థుడయ్యాడు.
సమయానుకూలంగా పెద్దలు ఉదహరించే హితోక్తులు నీతి శాస్త్రంలో భాగమే అంటారు పండితులు.
నీతి శాస్త్త్రం పుట్టుక గురించి కొందరు ఇలా చెబుతంటారు. సృష్టి తరువాత ప్రజలందరు ఎక్కడివారక్కడ సుఖ సంతోషా లతో, బాధ్యతా యుతంగా ధర్మపరులై చక్కని సంబంధాలతో, మానవ విలువలతో స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించేవారు.అపుడు రాజులు గాని, రాజ్యాలు గాని లేవు. కొంత కాలం తరువాత ప్రజల్లో కోరికలు పెరిగాయి. స్వార్థ చింతన ఎక్కువైంది. దుష్కర్మలు పెచ్చుమీరిపో యాయి. అప్పుడా పరిస్థిితులను చూసిిన దేవతలు ప్రజల మోసా లను, అధర్మాలను, అన్యాయాలను బ్ర హ్మ దృష్టికి తెచ్చారు. బ్రహ్మ ధర్మ శాస్త్రాన్ని సృష్టించి దేవతలకివ్వగా వారు లోకానికి అందించారని అదే నీతి శాస్త్త్త్రంగా శాఖోపశాఖలుగా విస్తరించిం దని చెబుతారు. విష్ణు శర్మ పంచ తంత్రం, నారాయ భట్టు హితోపదేశం, బోధిసత్వావ ధానం, భర్తృహరి సుభాషితాలు వంటివి ఎన్నో నీతి అనే పదానికి దారి చూపించాయి, నిర్వ చించాయి. భారతంలో నీతికి, న్యా యానికి మారుపేరైన విదురుడు గొప్ప ప్రజ్ఞాశాలి. మహాభారతంలో 33వ అధ్యాయం నుంచి 40వ అధ్య్యాయం వరకూ కౌరవులకు ధర్మాన్ని పాటించవలసిందిగా చెప్పే హిత బోధ విదుర నీతిగా ప్రఖ్యాతి చెందింది. అదే మహాభారతం లో జరిగిన దృపద పురోహిత రాయబారం, సంజయ రాయబారం, కృష్ణ రాయబారం. ఈ మూడు రాజనీతి, హితవాక్యాలతో కూడు కుని ఉన్నట్టు పండితులు చెబుతారు.
దురదృష్టవశాత్తు మహోన్నతమైన జ్ఞాన సంపద కలిగిన గ్రంథాల వైపు యువత కన్నెత్తయినా చూడడం లేదు. నీతి, ధర్మం, న్యాయం, వ్యక్తిత్వం మొదలైన వాటి గురించి ఉదాహరించే కథలు మన రామాయణ, భారత, భాగవతాల్లో ఉన్నట్టు వారికి తెలియటం లేదు. తల్లితండ్రులు తమ పిల్లలకు రామాయణ, భారత భాగవతాలలోని నీతి, ధర్మం, న్యాయం గురించిన విషయాలు, భగవద్గీతలోని సందేశాలను చెబితే రాబోయే త రం బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఒక ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, అబ్దుల్‌ కలాం వంటి వారు తప్పక తయారు కాగలరు. అంతేగాక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలను మన మేలుకోరే హిత వచనాలుగా భావించి స్వీయ రక్షణ చర్యలపై శ్రద్ధ చూపి మహమ్మారి వంటి రోగాలను సమర్థంగా జ యించగలరు కూడా!

పరికిపండ్ల సారంగపాణి
98496 30290

Advertisement

తాజా వార్తలు

Advertisement