Thursday, April 25, 2024

స్వయానికి అధిపతి (ఆడియోతో…)

ప్రశాంతమైన మన సుకు, సత్ప్రవర్తనకు సంబంధం ఉంది. ఇందులో కర్మేంద్రియాలు అయిన చూపు, వినికిడి, రుచి, వాసన ఎలా జోడింపబడి ఉన్నాయన్నది ఆసక్తికరమైన విషయము.

ఉదాహరణకు, నేను ఎప్పుడూ కోపగించుకోను అని ప్రతిజ్ఞ తీసుకున్నానుకోండి, ఎందుకంటే దానివలన వచ్చే హాని నేను అర్థం చేసుకున్నాను. కానీ మరుసటి రోజు ఏదైనా చెడును నేను విన్నాను లేక చూసాను అనుకోండి. అప్పుడు నేను నా ప్రతిజ్ఞను మర్చిపోతే , అంటే నా అవగాహన స్థాయిని తగ్గించుకున్నప్పుడు నా ప్రతిస్పందన ఆ చెడుకు సమానంగానే ఉంటుంది. కానీ ఒకవేళ, నేను నా ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకుంటే, ఈ స్మృతి ఒక తెలివైన, సమర్థవంతమైన స్పందనను నా నుండి తీసుకువస్తుంది.

ఆధ్యాత్మిక అధ్యయనంతో మనసు చేసిన ప్రతిజ్ఞలో దృఢంగా ఉండగలిగితే కర్మలలో శాంతి మరియు సత్యత వస్తాయి. ఈ శక్తి కర్మేంద్రియాలను సాధారణంగా సాగనివ్వక ప్రతి క్షణం స్వ పర్యవేక్షణలో వాటిని నడిపించగలుగుతాము. స్వ రాజ్యానికి అధిపతిగా కావడానికి ఇది మొదటి మెట్టు.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement