Saturday, April 20, 2024

స్నేహం – పగ

స్నేహం- పగ రెండు నాణానికి రెండు పార్శ్వాల వంటివి. స్నేహం మధురమైం ది. స్నేహం శాశ్వతమైనది. స్నేహంవల్ల మనసు నిర్మలం అవుతుంది. పగ, ప్రతీకారాన్ని కోరుతుంది. మనిషిలో పగ ఏర్పడితే, దుష్కృత్యాలకి తావు ఇస్తుంది, మనసుకి నిలకడ ఉండదు.
మనిషిలో పగ రాకుండానే ఉండాలి తప్ప, కక్షలు, కార్పిణ్యాల వల్ల తననుతాను దహించుకుపోతూ, చివరకు పగ పెంచుకొన్నవారిని సహితం చంపడానికి వెనుకాడని పరిస్థితి నెలకొంటుంది. ఎవరితోనూ హద్దులు దాటి ప్రవర్తించరాదు. పూర్తిగా తీరని ఋణం పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ, ఈ మూడింటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పటికైనా ప్రాణాంతకంగా, పరిణమించవ చ్చు. స్నేహంలో ఉండే పరిమితులు, పగవల్ల పొంచి ఉండే ముప్పు గురించి ఓ చిలుక చెప్పిన విషయాన్ని తెలుసుకొందాం!
బ్రహ్మదత్తుడు అనే రాజు, చిలుకపై ఉన్న మమకారంతో పోషిస్తూ, స్నేహంగా ఉండేవాడు. ఆ రాజుకు కొన్ని పక్షుల, జంతువుల భాష తెలియడంతో వారితో సంభాషి స్తూండేవాడు. ఆ చిలుక బ్రహ్మదత్తుని పెరటిలోని ఓ చెట్టుపైనే ఉండేది. కాలం సాగు తూండగా ఆ చిలుకకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టిచిలుకతో ఆడుకొనేవాడు. ఆ రాజకుమారుడు కూడా చిన్నవాడు. ఒకరోజు చిట్టి
చిలుకతో ఆడుకొంటున్న రాజకుమారుడికి కోపం వచ్చి, ఆ చిట్టి చిలుకను తన చేతులతో చిదిమేశాడు. దాని ప్రాణాలు పోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన పెద్ద చిలుక గుండె పగిలి రోధించింది. కోపం ఆపుకోలేక తన గోళ్ళతో రాకుమారుడు రెండు కళ్ళు పొడిచేసింది దాంతో అతని కళ్ళు పోయి అంధుడైపోయాడు. చిలక అంతటితో ఆగక, రాజు వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పింది. ”రాజా! నీ కుమారుడు నా బిడ్డను చంపి తప్పుచేసాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతడి కళ్ళు పొడిచి గుడ్డివానిని చేసేసాను. ఇందులో నా తప్పేమీ లేదుకదా! అయినా, ఇకమీదట నీకు- నాకు స్నేహం కుదరదు. ఇ క నేను ఇక్కడ ఉండలేను.” అని చెప్పింది. చిలుక మాటలు విన్న రాజు ”నువ్వన్నదీ నిజమే. జరిగిందాంట్లో ఎవరి తప్పూలేదు. రాకుమారుడు నీ బిడ్డను చంపేశాడు. కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు కదా! ఈ స్థితిలో నన్ను నీవు వదలి వెళ్ళిపోవలసిన అవసరం ఏమీలేదు కదా. అయ్యిందేదో జరిగిపోయింది. దయచేసి ఇకమీదట కూడా, నాకు మిత్రునిగానే ఉండు.” అన్నాడు.
దానికి చిలుక బదులిస్తూ ”రాజా! నీ కొడుకును అంధుడుని చేసాను కాబట్టి నీకు నామీద పగ ఏర్పడుతుంది. ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. 1) ఇతరుల భూమి, ఇతర స్థిరాస్థులు అపహరించడం వల్ల. 2) ఆస్థి పంపకాలలో అన్నదమ్ముల మధ్య 3) ఆడవారి మధ్య మాటామాటా పెరగడంవల్ల 4) ఎదుటివారి మనస్సును చేతలతోనో, మాటలతోనో గాయపరచడం వల్ల పగ ఏర్పడుతుంది. ఇటువంటి ప్రతికూల భావాలు ఒకసారి మనస్సులోకి చొరబడితే, ఇక వాటికి అంతం ఉండదు. ఇటువంటి విద్వేషపూ రితమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి ఉండదు. నా వల్లనే నీ కొడుకు అంధుడై పోయాడు. కాబట్టి నాపై విద్వేషం నీలో అంతర్గతంగా మొదలయ్యే ఉంటుంది. నీ ప్రియ వచనాలు వింటూ ఇక్కడ ఉండలేను” అంటూ చిలుక ఎగిరిపోయింది.
పగ వల్లనే కదా కౌరవులు విద్వేషంతో పాండవుల పతనాన్ని ఆశించి, ఎన్నో కుట్రలు పన్నారు. ఆఖరికి భారత యుద్ధంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
కౌరవులు పాండవులు మీద పగ ఏర్పడుచుకుని, ప్రతీకారాన్ని కోరడంవల్లే, కురుక్షేత్ర యుద్ధం సంభవించింది. కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి మనం పగను పెంచుకోకుండా స్నేహభావంతో మెలుగుతుంటే జీవన సాఫల్యం వస్తుంది.

  • అనంతాత్మకుల రంగారావు 7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement