Wednesday, April 24, 2024

సెప్టెంబరు 1 నుంచి 5 వ తేదీ దాకా మైసూరు దత్త పీఠంలో చతుర్వేద హవనం

తిరుపతి : శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అభ్యర్థన మేరకు మైసూరు దత్త పీఠం లో సెప్టెంబరు 1 నుంచి 5 వ తేదీ వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస పంచాహ్నిక చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించనున్నారు.

లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అవతరించిన శ్రావణ మాసంలో బహుళ దశమి నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. హోమ గుండాలు ఏర్పాటు చేసి నాలుగు వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేస్తారు.

ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వేద విద్వాంసుల ప్రసంగాలు, రాత్రి 7 నుంచి 8 గంటల దాకా భజనలు, నృత్య రూపకం, సంగీత కచేరీలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

1వ తేదీ వేదోక్త యజ్ఞం – ప్రయోజనాలు అనే అంశంపై విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ వి. లక్ష్మీనారాయణ ఘనాపాటి ఉపన్యసిస్తారు. 2వ తేదీ చతుర్వేద హవనం – ప్రాశస్త్యం అనే అంశం మీద జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధరశర్మ ఉపన్యాసం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement