Tuesday, April 16, 2024

సర్వ రక్షక నామం

ఔర దేవతా చిత్త న ధర ఈ||
హనుమత సేఇ సర్బ సుఖ కరఈ||
ఏ దేవతామూర్తిని ఉపాసిస్తే, ఆ ఉపాస్య దైవం తన సంపూర్ణానుగ్రహాన్ని ఉపాసకుడికి అను గ్రహి స్తుంది. ఇది ఉపాసనలో ఇమిడిన రహస్యం. ఉపా సన విధానం అంత సులభమైంది కాదు. మంత్రో చ్ఛాటనతో పాటు అనేక విధి విధానాలుంటయ్‌, శుచి, శుద్ధి, విశ్వాసం, నిస్వార్దం, లోక కళ్యాణ కాంక్ష, శ్రద్ధ, నియమం, నియతి… వంటివన్నిటిని నిర్దు ష్టంగా పాటించాలి.
ఒక దేవతా రూపాన్ని, ఒక లక్ష్య సిద్ధి కోసం ఉపాసిస్తున్న సమయంలో మరొక దేవతకు సంబం ధించిన విషయాలను మనసు లోనికి రానీయకూడదు. రానిస్తే ఫలితాలు పూర్తిగా లభించవు.
అంతేకాని, హనుమను తప్ప మరే ఇతర దేవత ను పూజింపకూడదని కాదు.
లక్ష్య సిద్ధి, కామ సిద్ధులు మాత్రమేగాక, కాల గమనంలో ఉపాసనా తీవ్రతను బట్టి ఆ ఉపాస్య దేవ తా లక్షణాలు కూడ ఉపాసకుడికి లభిస్తాయ్‌. ఇది నిజ సాధకుడి విషయంలో నిరూపితమౌతుంటుంది.
హనుమ భాగవతుడు. నిజ భక్తుడు. సౌమ్య, సౌజన్యమూర్తి. రోమ రోమంలో రామనామాన్ని నింపుకుని, నిలుపుకున్న సద్భక్తుడు. హనుమను ఉపాసిస్తే సర్వ సుఖాలు లభిస్తాయ్‌. ధర్మవర్తన, ధర్మం వలన కలిగే భౌతిక, ఆధ్యాత్మిక సంపద, లౌకిక, పౌర లౌకిక కామ్యసిద్ధి, చివరకు మోహ క్షయం జరిగి, శ్రీ రామచంద్ర భక్తి సామ్రాజ్య ప్రవేశం లభిస్తయ్‌.
ఏ సాధకుడికి అయినా కావలసినది ఇదే!

– వి.యస్‌.ఆర్‌.మూర్తి
9440603499

Advertisement

తాజా వార్తలు

Advertisement