Friday, April 26, 2024

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం

శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు యజ్ఞావతార విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

రుచి అనే ప్రజాపతికి ఆకూతికి యజ్ఞా నామంతో అవత రించిన స్వామి సప్తమావతారం యజ్ఞావతారం. యమ మొదలగు దేవతాగణముతో స్వాయంభువ మనువంతరమున ఈ ప్రపంచమును పరి పాలించెను. అన్ని పుణ్య కర్మలకంటే శీఘ్రముగా ఫలమునిచ్చునది యజ్ఞము. బుద్ధిని, మనస్సుని, శరీరమును పరిశుద్ధము చేయునది, సకల దేవతాగణమును సాక్షాత్కరింపచేయునది, ప్రతీ కోరికను తీర్చునది యజ్ఞము మాత్రమే అని బోధించి ప్రపంచమున యాగములను వ్యాపింపచేసి తాను యజ్ఞపురుషుడనని చాటి చెప్పిన అవతారం యజ్ఞావతారం.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement