Thursday, March 28, 2024

శివలింగ ఆరాధనలో అంతరార్థం

”శంభో శంకర… ఓం నమశ్శివాయ” అంటూ నిత్యం శివపూజలు చేస్తాం. శివలింగానికి షోడశోపచార పూజలు చేసేముందు శివలింగంలోని పీఠం అమ్మవారు. లింగం శివుడుగా మనం తెలుసుకోవాలి. స్వయంభూలింగాలు గాని, దేవ, ఋషి, మానవ ప్రతిష్ఠితాలైన లింగాలలో ఏదో ఒక దానిని నిత్యం సేవించాలి. వీలైంతలో షోడశోపచా రాలతో సేవించాలి. అలా వీలుకానివారు పూజా ద్రవ్యాలను సమర్పించి నమస్కరించినా చాలు. ప్రతిరోజూ గుడికి వెళ్ళి శివదర్శనం చేసుకునేవాళ్ళు తప్పక శ్రేయస్సు పొందుతా రనడంలో సందేహం లేదు. అలాగే శివలింగాన్ని మట్టితో గాని, పిండి మొదలయిన వాటితో చేయవచ్చును. మంత్రో బద్ధంగా శివార్చన చేయడం పుణ్యం. అలా కుదరనివాళ్ళు శివలింగాన్ని దానం చేయవచ్చును. రోజుకి పదివేలసార్లు ప్రణవం జపించాలి. వీలుకాని పక్షం లో ఉదయం, సాయంసంధ్యలలోనైనా కనీసం వెయ్యి పర్యాయాలైనా జపించాలి. ఓంకారం మకారాంతంగా ఉచ్ఛరించాలి. గబగబా జపిం చక, ఏకాగ్రతతతో మనసులోనే అనుకోవాలి. కనీసం పెద వులు కూడా కదపకూడదు. ఎవరు జపించినా గురూ పదేశం పొందడం ముఖ్యం. శివానుగ్రహం కోసం శివాల యంలో నువ్వులనూనెతో నిత్య దీపారాధన చేయడంతో పాటు, ఆలయం, నందీశ్వరుని శుభ్రపరచడం కూడా శివారాధనలో భాగం అవుతుంది. శివోత్సవాలలో పాల్గొని చేయూత నిచ్చినవారికి భక్తి, భుక్తి, ముక్తి లభిస్తాయి.
– చివుకుల రాఘవేంద్రశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement