Friday, March 29, 2024

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయి ల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈవో విలేకరులతో మాట్లాడు తూ, అక్టోబర్‌ 7 నుంచి 15 వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించు కుని మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించినట్లు చెప్పారు. సాధారణంగా సంవత్సరంలో ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్స వం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ హించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనంద నిలయం మొద లుకుని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసా దాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడల పై కప్పుతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు. కాగా ఆలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పార్థసారథి, మధుసూదన్‌ యాదవ్‌, డీఎల్‌వో రెడ్డెప్ప, ఆలయ డిప్యూటి ఈవో రమేష్‌బాబు, వీజీవో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు లేఖలు తీసుకోరు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 7న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కారణంగా గురువారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అందుకే బుధవారం బ్రేక్‌ దర్శనాలకు ఎలాంటి సిఫారసు లేఖలూ స్వీకరించేది లేదని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. వీఐపీలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహ కరించవలసిందిగా విజ్ఞప్తి చేసింది.
15న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్‌ 15 న చక్రస్నానం కారణంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కారణంగా ఆ రోజున వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. అక్టోబర్‌ 14న బ్రేక్‌ దర్శనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించేది లేదని టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement