Friday, April 19, 2024

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల, ప్రభన్యూస్‌: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్ట ంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి సమ క్షంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై ధ్వజ పటాన్ని ఎగురవేశారు. అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు. ధ్వజారోహణ ఘట్టానికి ముందు సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన అనంత, గరుడ, చక్రతాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకం చుట్టూ ఊరేగించారు.
పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన గురువారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో పెద్దశేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడు తలల స్వర్ణ శేషవాహనంపై (పెద్దశేష వాహనం) పరమపదనాథుని అలం కరణలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన శిరస్సుపై సమస్త భూభా రాన్ని మోస్తుంటాడు. ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావ తారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, శ్రీమన్నారాయనుడికి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిద ర్శనం. స్వామివారికి పాన్పుగా, దిండుగా, పాదుకలుగా, ఛత్రంగా, వాహనంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం ఆపై పరమపథం సిద్ధిðస్తాయి. ఈ కార్యక్రమంలో పెద్దజీ యర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement