Saturday, April 20, 2024

లోక కళ్యాణమే హిందూధర్మం లక్షణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సర్వేజనా సుఖినోభవంతు అంటూ లోకకళ్యాణం కోరుకునే దే హిందూ ధర్మమని, ప్రపంచంలో మరే ధర్మానికీ ఈ లక్షణం లేదని ధర్మాచార్యులు అన్నారు. తోటి మనిషిలో దైవాన్ని చూసి, సహాయంపడే వ్యక్తిత్వం హిందువుల సొంతమని పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం ధర్మచార్యుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి దాదాపు 82 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరై ప్రసంగించారు. వచ్చే డిసెంబర్‌ 14న గీత జయంతి రోజు లక్ష మంది యువకులతో ”లక్ష యువ గళ గీతార్చన” కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సాధు సంతులతో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు.75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదిక అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విశ్వహిందూ పరిషత్‌ లక్ష యువ గళ గీతార్చన వేడుక నిర్వహస్తుందని చెప్పారు. యువతలో ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. విశ్వగురుగా భాసిస్తున్న భారత్‌… భగవద్గీత ఆధారంగా జ్ఞానాన్ని అందించింది అని అన్నారు.విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి మాట్లాడుతూదేశంలో లౌకికత్వం ముసుగులో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. అయితే మరోవైపు ప్రపంచం హిందుత్వం వైపు చూస్తోందని అని చెప్పారు. యోగా డే, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి మహత్తర ఘట్టాలతో హిందుత్వం బలపడుతోం దన్నారు. ప్రపంచ దేశాలన్నీ హిందూ జీవన విధానాలకు ఆకర్షితులవుతున్నాయన్నారు. డిసెంబర్‌ 14 గీత జయంతి రోజున 16 నుంచి 40 సంవత్సరాల వయసున్న లక్ష మంది యువకుల తో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భగవద్గీత పారాయణం చేస్తామన్నారు. అంతకుముందు అక్టోబర్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన లక్ష యువ గళ గీతార్చన పేరుతో రథయాత్ర నిర్వహిస్తామని యాదిరెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ , మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుంచి స్వామీజీలు మరియు 165 ధార్మిక సంస్థల ప్రతినిధులు హాజరు కావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement