Wednesday, April 17, 2024

రోజూ వెయ్యి మంది వెనుకబడిన వర్గాల వారికి దర్శనం

13 జిల్లాల నుంచి ఉచితంగా బస్సులు
తిరుమల, ప్రభన్యూస్‌: రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రోజుకు 1000 మందికి చొప్పున వెనుక బడిన వర్గాల భక్తులకు అక్టోబర్‌ 7 నుంచి 14 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తారు. హింధూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో టిటిడి మొదటి విడతో రూ.25 కోట్లతో 13 జిల్లాలలో 502 ఆలయాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతుంది. ఒక్కో జిల్లా నుంచి 10 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకురావడం జరుగుతుంది. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేయడమైనది. ఒక్కో బస్సులో ఇద్దరు సమరసత సేవా ఫౌండేషన్‌ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మార్గమధ్యంలో స్థానిక దాతల సహకారంతో ఆహార పానీయాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement