Tuesday, April 23, 2024

రోజంతటిలో కనీసం ఏడుసార్లు విశేష యోగాభ్యాసం

”మనం మన దిన చర్యలో ఎక్కువ చేయలేకపోయినా కనీసం ఏడుసార్లైన సరే ముఖ్యంగా ఈశ్వరీయ స్మృతిలో కూర్చొవాలి” అనే విషయం పై ధ్యాస వహించాలి. ప్రతి పరిస్థితిలో కూడా 8 గంటలు మనం దీనిని అభ్యాసము తప్పకుండాచేయాలి. సాధారణంగా లౌకికమైన స్థూల కార్యములలోనే అందరూ రోజంతా నిమగ్నమై వుంటారు. సాయంత్రం కూడా తమ బుద్ధిని మరియు కర్మేంద్రియాలను ఈ ప్రాకృతిక జగత్తు నుండి తొలగించి పరమాత్మ వైపు నిమగ్నము చేసే అభ్యాసము చేయుట లేదు. దీని కొరకు తీవ్ర ప్రయత్నముగాని ఎవరూ చేయలేక పోవుచున్నారు. కావున ఎంత వ్యస్థ జీవితము అయినప్పటికీ రోజంతటిలో కనీసం 7 సార్లు అయినా మనం 15-15 నిముషములు ఈశ్వరీయ స్మృతి కోసం తప్పకుండా సమయం కేటాయించుకొనవలయును. ప్రాత: కాలంలో ఈశ్వరీయ జ్ఞాన సేవా కేంద్రాలకు వెళ్ళి మనం ప్రతినిత్యం అభ్యాసం చేస్తూనే వుంటాము. కాని రెండుసార్లు భోజనము చేసేముందుగా మరియు భోజనము చేసే సమయంలో, ప్రాత: కాలములో లేవగానే రాత్రి కూడా నిద్రించుటకు ముందుగా, సంధ్యా సమయములో అనగా పగలు, రాత్రి కలుసుకునే సమయములో, రాత్రి కాఆసులో లేక ఇంట్లో, ఒక సారి మధ్యాహ్నం ఈ విధముగా కనీసం 7 సార్లు 15 – 15 నిమిషాలు చొప్పున ఈశ్వరీయ స్మృతి అభ్యాసము చేయాలి. భోజనము మనముందు వడ్డించిన తరువాత ఆత్మిక స్థితిలో, పరమాత్మ స్మృతిలో కూర్చొనుట వలన మన స్థితి అవ్యక్తముగా తయారవుతుంది.

మనినషి కార్యభారానికి లోనై అనేక సాకులు చెప్పి యోగాభ్యాసము యొక్క ఈ సువర్ణ అవకాశమును కోల్పోవుచున్నాడు. దీని వలన అతని యోగము సూక్ష్మత్వములోనికి సాగిపోజాలదు. పైగా యోగాబ్యాసము తెగిపోవుట చేత, అతని మానసిక స్థితి వ్యక్తములోనికి జారిపోతూ వ్యవహారిగా సంసారిగా తయారు చేస్తుంది. కావున అన్ని కార్యాలుకంటే కూడా ఈ అభ్యాసమును చాలా అవసరము అని భావించి, జన్మజన్మల సంపాదనకు, ఇదే సాధనముగా గ్రహించి ఈశ్వరీయ నిర్దేశమును తెలిసికొని ఏ విధముగానైనా సరే సమయమును పొదుపు చేసుకొని, దీని కొరకు సమయమును సమకూర్చుకొనాలి. పరమపిత శివ పరమాత్మ నుండి ”నాకు టెలిగ్రాము వచ్చింది, ట్రంకాలు వచ్చింది, లేక నాకోసం అత్యవసరమైన సందేశము వచ్చింది అని భావించాలి. నేను నడుస్తూ తిరుగుతూ, లేస్తూ కూర్చుంటూ యోగము చేస్తాను”అని ఈ విధంగా ఆలోచించి ముఖ్యముగా పరమాత్మను కలుసుకొనుటకు కూర్చొని యోగాభ్యాసము చేసే అలవాటును విడిచిపెట్టుట చాలా హానికరమైనది. పనులు చేస్తూ కూడా ఈశ్వరీయ స్మృతిలో ఉండే ప్రయత్నము చేయవలసిందే. ఇంతే కాకుండా రోజంతటిలో ముఖ్యముగా చాలా సార్లు సహజసమాధి యొక్క అభ్యాసము మరియు అననుభవ ము చేసికొనుట చేత స్థితి చక్కగా తయారవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement