Thursday, April 18, 2024

యాదాద్రికి విరాళాల వెల్లువ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీఎం కేసీఆర్‌ పిలుపుతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విమాన గోపురం స్వర్ణతాపడం కోసం విరాళాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. సీఎం పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే ప్రజల్లో నుంచి భారీ స్పందన వచ్చింది. మొదటి రోజు 22.16 కిలోల బంగారం రాగా.. రెండో రోజు 11 కిలోల బంగారం విరాళంగా వచ్చింది. పంచనారసింహుడి దివ్యక్షేత్రం యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం చేయడంలో తెలంగాణ సమాజం, సమస్త భక్తకోటి భాగస్వామ్యం కావాలని యా దాద్రి ఆలయ ఈవో ఎన్‌ గీత సూచించారు. దివ్య విమాన గోపురానికి బంగారుతాపడం చేయించడం కోసం విరాళాలకు ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. దాంతో సామాన్యుల నుంచి సంపన్నుల దాకా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం భాగస్వామ్యం కావాలని ఆలయ కమిటీ తెలిపింది. డబ్బు కంటే తెలంగాణ సమాజం భాగస్వామ్యమే ముఖ్యమని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలను నిజం చేస్తూ ఈ గొప్ప అవకాశాన్ని భక్తులు సద్వినియోగంచుకోవాలని కోరారు.
విరారాళ వెళ్లువ..
సీఎం కేసీఆర్‌ ఇప్పటికే 1.16 కిలోల బంగారాన్ని గోపురం స్వర్ణతాపడం కోసం విరాళంగా ఇచ్చారు. సీఎం పిలుపుతో ఇప్పటి వరకు మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమి టడ్‌ 6 కిలోలు, హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపనీస్‌ చైర్మన్‌ పార్థ సారథి రెడ్డి 5 కిలోలు, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నరసింహారెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్ర కుమార్‌ కామరాజు 2 కిలోలు, మంత్రి హరీ శ్‌రావు 1, చెన్నూరు ప్రజల పక్షాన ఎమ్మెల్యే బాల్క సుమన్‌ 1 కిలో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు గోపురం స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.
కేసీఆర్‌ తాతకు బుడతడి ఉడత సాయం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ఓ ఐదేళ్ల బాలుడు ముందుకొచ్చాడు. సన్విత్‌ వీర్‌ అనే బాలుడు తన చేతికి ఉన్న ఉంగరాన్ని విరాళంగా ఇస్నానని తెలిపాడు. కేసీఆర్‌ తాత నమస్తే.. నా చేతి వేలి ఉంగరం ఇస్తున్నా.. యాదాద్రి గుడికి నేను హెల్ప్‌ చేస్తున్నా తాతా…’ అంటూ ఆ బాలుడు వీడియోలో పేర్కొన్నాడు.

చిన్నపరెడ్డి, దానం స్వర్ణ కానుకలు
యాదాద్రి గోపురానికి చెరో కేజీ
యాదాద్రిలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో విమాన గోపురం బంగారు తాపడం చేయడానికి ఒక్క కిలో బంగారం బహుకరిస్తున్నానని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అన్నారు. గురువారం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన ఈ విషయం తెలిపారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు యాదాద్రి ఆలయ గోపురం స్వర్ణ తాపడం కోసం శ్రీ లక్ష్మి నరసింహస్వామి మీద భక్తితో ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఖైరతాబాద్‌ శాసనసభ్యులు దానం నాగేందర్‌ ప్రకటించారు. ఆధునిక చరిత్రలో ఒక ప్రజా పరిపాలకుడు ఇంత గొప్ప వైభవంగా ఒక ఆలయాన్ని పునర్‌నిర్మించడం ఒక అద్భుతమని దానం పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement