Thursday, March 28, 2024

మౌనము (ఆడియోతో…)

నీలో ఒక సంపూర్ణమైన, పవిత్రమైన మనసు ఉంది. అసంపూర్ణమైన ప్రపంచంలో ఉంటూ నీవు అలవర్చుకున్న అసంపూర్ణ గుణాలు నీ సంపూర్ణ మనసును తాకలేవు.
అది దివ్య గుణాలతో నిండి ఉంది, కనుక అది సర్వదా సమర్థతలతో చక్కగా ఉంది. ఎటువంటి కల్మషాలు లేని కారణంగా నీ సంపూర్ణ మనసు నిన్ను ఒక ప్రశాంతమైన జ్యోతిగా, గుహ్యమైన శాంతిని అనుభవం చేసుకునేందుకు దోహదపడుతుంది.

నీలోని ఈ ప్రశాంతమైన, మౌన ప్రాంతానికి చేరుకోవడానికి సమయాన్ని కేటాయించు. ఇది నీకు చెప్పనలవి కాని లాభాలను చేకూరుస్తుంది. మొదటిది, ఇది నీ
ఆలోచనలను మెరుగైన విధంగా ఉంచుతుంది. ఉదాహరణకు, ఎప్పటిలా నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అని నీకు అర్థమవుతుంది. మౌనంలో కూర్చున్నప్పుడు ఎటువంటి కష్టం లేకుండానే, అప్రయత్నంగానే నీకు కావలసింది నీకు వస్తుంది.

రెండవది, మౌన అనుభూతి నిన్ను నకారాత్మక ధోరణుల గుప్పిడి నుండి విడిపిస్తుంది. మరింత సునాయాసంగా నువ్వు నీలోని ఆంతరిక శాంతి, ఘనతను అవగతం చేసుకోగలవు. మనసు కేంద్రీకరణతో, సమర్థవంతంగా ఉండ టానికి ఇది సహకరిస్తుంది.

మూడవది, మౌన శక్తిని పంచుకోవచ్చు. నీలోని శాంతి శక్తిని నువ్వు పెంచుకున్నప్పుడు, స్వ ఉన్నతిని మరియు శాంతి శక్తిని అనుభవం చెయ్యలేని వారికి నీ శక్తి ఉపయోగపడుతుంది. నీలోని శాంతి అనే స్టాకు, అలాగే సత్యత మరియు సమర్ధవంతమైన ఆలోచనలు అనే స్టాకు ఇతరులను హద్దుల నుండి దూరంగా అనంతమైన దివ్యత్వానికి తీసుకువెళ్తుంది.

ఆలోచనను, మాటలను అన్నింటినీ పక్కనబెట్టి ప్రశాంతంగా కొద్దిసేవు ఈ విధంగా ‘అనంతం’ లోకి వెళ్లడం చాలా బాగుంటుంది. ఈ అనుభూతి ఎంతో తాజాదనాన్ని, శక్తిని ఇస్తుంది. ఈ అలవాటును అలవర్చుకోవాలి. ఆధ్యాత్మిక అంతర్ముఖత, ఏకాంతము మరియు మౌనము పట్ల ఉన్న ప్రేమ మన జీవితానికి ఎంతో సుందరమైన సంపూర్తిని ఇస్తుంది.

- Advertisement -

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement