Saturday, April 20, 2024

మహా సరస్వతీదేవి

యాకుందేదు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యావీణా వరదండ మండిత కరా యా శ్వేతపద్మాసన
యా బ్రహ్మాచ్యుత శంకర: ప్రభతిభి: దేవై సదాపూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేష జాడ్యాపహా !!

దుర్గా నవరాత్రులలో సప్తమి తిథినాడు అమ్మవారిని సరస్వతి అవతారంలో ఆరాధిస్తారు. దేవతామూర్తులలో చదువు ల తల్లిగా సరస్వతీదేవి కొలువబడుతుంది. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ పట్టపు రాణి. సృష్టి కార్యం నిర్వ #హంచటానికి బ్రహ్మకు తోడుగా ఈమెను మహా శక్తి సృజించినట్లుగా దేవీభాగవతం తెలియ చేస్తోంది. సకల విద్యల కు, కళలకు, సకల జ్ఞానా నికి ఈమె చిహ్నం. దేవీ భాగవతం నవమ స్కం దంలో సరస్వతీదేవిని గూర్చి వివరించబడి నది. హంసవాహనిగా, వీణాపాణిగా ఈమెను కొలుస్తుంటారు. మహా
కవుల హృదయ కమలమనే వనమును వికసింపచేసే లేత సూర్యుని వంటి కాంతిగ అరుణవర్ణ స్వరూపిణి అయిన సరస్వతి మాతను ఎవరైతే సేవిస్తారో వారు శృంగార రస పూర్ణమైనవి, గంభీర మైనవి, పటుత్వము గలిగిన కవితలతో మనస్సును రంజింపచేయ గలరు. సరస్వతీదేవి పాదజము మూగవారిని కూడా మహాకవులుగా చేయును. మూకశంకరులు పుట్టుకతోనే మూగవారు. వారు సరస్వతీదేవి కరుణవలన ”మూకపంచశతి”అనే గ్రంథాన్ని రచిం చారు. తెల్లని పద్మముపై ఆసీనురాలై వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో దర్శనమిస్తూ భక్తులకు
జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తుంది. ఈ రోజు మూలానక్షత్రము గావ టం వలన సరస్వతీ అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.
శ్రీసరస్వతీ ద్వాదశనామ స్తోత్రము
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ|
హంస వాహ సమాయుక్తా విద్యాదానక రీమమ|
ప్రథమం భారతీనామ ద్వితీయంచ సరస్వతీ|
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహనా|
పంచమం జగతివిఖ్యాతాం షష్టం వాగీశ్వరీ తథా|
కౌమారీ సప్తమం ప్రోక్తా అష్టమం బ్రహ్మచారిణీ|
నవమం బుద్ధిధాత్రీచ దశమం వరదాయినీ|
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ|
బ్రాహ్మద్వాదశ నామాని త్రిసంధ్యయ: పఠేన్నర:|
సర్వసిద్ధి కరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ|
సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ||
ఈ సరస్వతీ స్తోత్రం పారాయణ చేసి విధిగా 14 ప్రదక్షిణలు చేయాలి. ఈ మాతకు తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు సమర్పించి, బెల్లం అన్నం, ముద్దపప్పు నైవేద్యంగా సమర్పించాలి.
విజయవాడ కనకదుర్గమ్మ ఈరోజు సర స్వతీదేవిగాను, శ్రీశైలం భ్రమరాంబ కాత్యా యని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
మహిషాసుర సంహారానికి త్రిమూర్తులై న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులతో సృజించిన అవతారం కాత్యాయని. ‘కొత్స’ (కాత్యాయనుడు) అనే ఋషి పార్వతీమాత
కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించినందున కాత్యాయని అని పిలుస్తారు. ఈమె వాహనం సింహం. పసుపు రంగు వస్త్రాలతో అలంకరించి, బెల్లం అన్నం, ముద్ద పప్పు నైవే ద్యంగా సమర్పించాలి.

– డా. దేవులపల్లి పద్మజ
98496 92414

Advertisement

తాజా వార్తలు

Advertisement