Thursday, April 25, 2024

భక్తుల మనోభావాలను గౌరవిద్దాం

అమరావతి, ఆంధ్రప్రభ: ‘పవిత్రమైన దేవ దాయశాఖలో పని చేయడం పూర్వజన్మ సుకృతం. ఉన్నత గుణాలను అలవరుచుకొని భక్తుల మనోభావా లు దెబ్బతినకుండా నమ్మకం పెంచుదాం… ఉదాత్త ఆశయంతో దాతలు ఆలయాలకు ఇచ్చిన ఆస్తులను పరిరక్షిస్తూ..ఆలయాల విశిష్టత దెబ్బతినకుండా శాస్త్ర నియమాలను అనుసరించి నిత్య కైంకర్యాలు నిర్వహిద్ధాం’ అంటూ దేవదాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌ ఉద్యోగులకు ఉద్బో ధించారు. దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తదనంతరం ఉద్యోగులతో సమావేశమై ప్రభుత్వ లక్ష్యాలు, తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. మతా లు, దేవాదాయశాఖ మధ్య సమన్వయం ఉండాల నేదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి లక్ష్యమ న్నారు. ఇందుకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు అక్కడ కొంత సమయం వెచ్చించే వాతా వరణం కల్పించాలన్నారు. హిందూ ధర్మం ప్రచారం పై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, వేద పఠనం, పారాయణం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత క్రమశిక్షణ పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెపు తూ, ఆశావాహ దృక్ఫదంతో ఉండాల న్నారు. ఆల యాలకు ఉదాత్త ఆశయంతో దాతలు ఇచ్చిన భూము లను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నా రు. రానున్న రోజుల్లో సమస్యల ను పరిష్కరించేందు కు ఉద్యోగులతో తాను తరుచూ సమావేశం కానున్న ట్లు తెలిపారు. ఆయా సమావేశాల్లో అన్ని అంశాలపై స్పష్టమైన వైఖరి వెల్లడిస్తానని ఆయన చెప్పారు. సమావేశంలో ప్రాంతీయ సంయుక్త కమిషనర్లు, డి
ప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ప్రధాన కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆలయ ఆస్తులకు రక్షణ
రాష్ట్రంలోని దేవదాయశాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు హరి జవహర్‌లాల్‌ తెలిపారు. ఉద్యోగులతో సమావేశం తర్వాత తనను కలిసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల దేవాదాయశాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరత, దౌర్జన్యాలతో ఆలయ భూము లు అన్యాక్రాంతానికి గురైనట్లు పేర్కొన్నారు. ఆలయాల చర, స్థిర ఆస్తులపై ప్రత్యేక దృష్టిసారించ నున్నామన్నారు. ఆలయాల భద్రతపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. భక్తుల భద్రతతో పాటు ఆరోగ్య పరిరక్షణ, మొక్కలు, గోవుల రక్షణపై కూడా దృష్టిసారించనున్నామన్నారు. సకాలంలో పదోన్నతులు రాకపోవడానికి వారిలో కొందరు కారణమని హరి జవహర్‌ లాల్‌ తెలిపారు. ఏదో ఒక నెపంతో పదోన్నతులను అడ్డుకుంటున్నా రని చెపుతూ అందరితో చర్చించి, సీనియారిటీ ఆధా రంగా పదోన్నతులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తనపై నమ్మ కంతో అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటానని హరి జవహర్‌ లాల్‌ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా జాతీయ స్థాయిలో 20 అవార్డులు రావడానికి ఇన్‌చార్జి మంత్రి వెలంపల్లి సహకారం మరువలేనిదన్నారు. తిరిగి ఆయన శాఖలోనే విధులు నిర్వహించాల్సి రావడం ఆనం దంగా ఉందని పేర్కొంటూ ఆలయ ఆస్తుల పరిరక్షణ, ఆలయాల పవిత్రతకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement