Thursday, April 18, 2024

బ్రహ్మాకుమారీస్‌.. సత్యమైన త్యాగము (ఆడియోతో…)

త్యాగము అంటే ఏమిటి? సన్యాసులు త్యజించే ఇల్లు, వాకిలి గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది అని ముందు మనం గుర్తించాలి. ఎందుకంటే కేవలం స్థూలమైన భౌతిక విషయాల త్యాగము మాత్రమే. ఆ త్యాగం హద్దులకు పరిమితమైనది కనుక, అది ఉన్నతమైన త్యాగము అని అనిపించకోదు. గృహస్థంలో ఉంటూ కూడా వ్యక్తులు, పరిస్థితులతో వ్యవహరిస్తూ కూడా వాటిపై ఆకర్షణ లేనివాడే అందరికన్నా ఉత్తముడు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ కూడా ఆకర్షణ పరిచే వలలో అతడు ఇరుక్కోడు. అతనిలో పరిత్యాగము, నిర్మోహము నిండిన భావాలు ఉంటాయి. మరో ప్రక్క, సన్యాసులు కేవలం ప్రాపంచిక బంధాలు, వస్తువులను త్యజిస్తారు. నిజాని కి, వాటి పట్ల ఉన్న మమకారాన్ని, బంధాన్ని, బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఉండే అహంకార భావాన్ని వారు త్యజించాలి. కనుక, వారిది, మనం ముందుగా అనుకున్నట్లుగా, సామాన్య త్యాగము. వారు ఇంటికి, పరివారానికి దూరంగా ఉంటారు. కానీ వారిలో ఉన్న బాంధవ్య మమకారాన్ని మాత్రం దూరం చేసుకోలేరు.
రెండవది, ఒకవేళ వారు తమ భౌతిక వస్తు వైభవాల నుండి దూరమైనా కానీ వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి దూరం కాలేరు. వారి త్యాగము హద్దులు కలిగినది, సామాన్యమైనది. మనిషి ఈ ప్రపంచంలోనే ఉంటూ వాటి ప్రభావంలోకి రాకుండా, పుష్పంలా చుట్టూ ఉన్న బురద అంటుకోనివ్వకుండా హుందాగా ఉండటమే ఉత్కృష్టమైనది. ధార్మికమైనది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement